భర్త ట్రాలీ ఆటోలో పరుపుల వ్యాపారం.. భార్య కష్టపడి చదివి టీచర్ జాబ్ సాధించింది.. జాబ్లో జాయిన్ అయిన మూడు నెలలకే..

భర్త ట్రాలీ ఆటోలో పరుపుల వ్యాపారం.. భార్య కష్టపడి చదివి టీచర్ జాబ్ సాధించింది.. జాబ్లో జాయిన్ అయిన మూడు నెలలకే..
  • ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో విషాదం

వైరా, వెలుగు: ఖమ్మం జిల్లా వైరా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన దంపతులు చనిపోయారు. వివరాలిలా ఉన్నాయి.. ఏపీ రాష్ట్రం విజయనగరం జిల్లా రాజాం గ్రామానికి చెందిన వడ్డాది రాము(44), వెంకటరత్నం(37) దంపతులు పదేండ్ల నుంచి వైరా పట్టణంలో ఉంటున్నారు. ఇటీవల ఏపీలో నిర్వహించిన మెగా డీఎస్సీలో వెంకటరత్నం టీచర్​గా ఎంపికవగా, జగ్గయ్యపేట గురుకుల గిరిజన పాఠశాలలో పోస్టింగ్ ఇచ్చారు. రాము వైరాలో ట్రాలీ ఆటో నడుపుతున్నాడు.

మంగళవారం రాత్రి రాము ట్రాలీ ఆటోలో పరుపుల వ్యాపారం చేసి, భార్యతో కలిసి వైరాకు బయలుదేరాడు. సోమవారం గ్రామ సమీపంలో వైరా నుంచి బోనకల్  వైపు వెళ్తున్న లారీ ట్రాలీ ఆటోను ఢీకొట్టడంతో వెంకటరత్నం అక్కడికక్కడే చనిపోయింది. తీవ్రగాయాల పాలైన రాము ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం చనిపోయాడు. పెద్ద కొడుకు ఓం సాయి వికాస్  పదో తరగతి చదువుతుండగా, రెండో కొడుకు పార్థు ఏడో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు చనిపోవడంతో పిల్లలు అనాథలయ్యారు.