Rashmika Mandanna Income Tax: నటిగా రష్మిక మందన్న సంపాదన ఎంత అన్న విషయం పక్కన పెడితే.. తాజాగా ఆమె చేసిన ఒక పని హాట్ టాపిక్‌గా మారింది. తన సొంత జిల్లా అయిన కర్ణాటకలోని కొడగులో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తిగా రష్మిక సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం గ్లామర్ పరంగానే కాకుండా, ఆర్థిక క్రమశిక్షణలోనూ తాను 'నేషనల్ క్రష్' అని ఆమె నిరూపించుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మూడు వాయిదాలలో రష్మిక రూ.4కోట్ల69లక్షలు ఆదాయపు పన్ను చెల్లించింది. మార్చి నాటికి నాలుగో వాయిదా కూడా పూర్తయితే ఈ మొత్తం మరింత పెరగనుంది.
రష్మిక వృత్తిపరమైన ప్రయాణం ఇప్పుడు పీక్ స్టేజ్‌లో ఉంది. 'కిరిక్ పార్టీ'తో మొదలైన ఆమె కెరీర్.. ప్రస్తుతం పాన్-ఇండియా రేంజ్‌కు చేరుకుంది. ఒక్కో సినిమాకు ఆమె రూ.10 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమాలతో పాటు భారీ బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా కూడా ఆమె సంపాదన కోట్లలోనే ఉంది. ప్రస్తుతం ఆమె నికర ఆస్తి విలువ దాదాపు రూ.66 కోట్లుగా అంచనా. కేవలం డబ్బు సంపాదించడమే కాకుండా తెలివైన పెట్టుబడులతో తన ఆస్తులను ఆమె పెంచుకుంటోంది.
ALSO READ : రాజా సాబ్ థియేటర్లపై.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన SKN కామెంట్స్..
లగ్జరీ లైఫ్‌స్టైల్ విషయంలోనూ రష్మిక వెనక్కి తగ్గడం లేదు. కొడగులోని విరాజ్‌పేటలో విలాసవంతమైన బంగ్లాతో పాటు బెంగళూరులో రూ.8 కోట్ల విలువైన ఇల్లు ఆమెకు ఉంది. ముంబైలో షూటింగ్స్ కోసం హోటల్స్ లో ఉండకుండా ఉండేందుకు వర్లీలోని ఆహుజా టవర్స్‌లో ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కూడా కొనుగోలు చేసింది. ఇవే కాకుండా హైదరాబాద్, గోవా, కూర్గ్‌లో ఆమెకు పలు స్థిరాస్తి పెట్టుబడులు ఉన్నాయి. ఆమె గ్యారేజీలో ఆడి క్యూ3, రేంజ్ రోవర్ స్పోర్ట్, మెర్సిడెస్ బెంజ్ వంటి ఖరీదైన కార్ల కలెక్షన్ ఉంది.
ALSO READ : కోటి కంటే ఖరీదైన ఇళ్లకే మస్త్ డిమాండ్..
కొత్త ఏడాదిలోనూ రష్మిక చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. షాహిద్ కపూర్, కృతి సనన్ లతో కలిసి హిందీ చిత్రం 'కాక్టెయిల్ 2'లో ఆమె నటిస్తోంది. అలాగే తెలుగులో 'మైసా' అనే పవర్‌ఫుల్ సినిమాలో వారియర్ పాత్రలో కనిపించనుంది. వీటన్నింటికీ మించి 'పుష్ప 3: ది రాంపేజ్' కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండతో ఆమె పెళ్లి గురించి వస్తున్న వార్తలు రోజురోజుకూ బలపడుతున్నాయి. ఫిబ్రవరి 2026లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఏదేమైనా ఒక సాదాసీదా అమ్మాయి నుంచి కొడగు జిల్లాలోనే హయ్యెస్ట్ టాక్స్ పేయర్‌గా ఎదగడం రష్మిక సాధించిన గొప్ప విజయమనే చెప్పుకోవాలి.
