The Raja Saab Review: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

The Raja Saab Review:  ప్రభాస్ ‘ది రాజా సాబ్’ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కామెడీ చిత్రాల దర్శకుడు మారుతి కాంబోలో వచ్చిన మూవీ ‘ది రాజా సాబ్’ (The Raja Saab). హారర్‌ ఫాంటసీ కామెడీ థ్రిల్లర్‌ జానర్లో వచ్చిన మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. దానికితోడు భారీ బడ్జెట్‌తో పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించి గట్టి ప్రమోషన్స్ చేసింది. అలాగే, ప్రభాస్‌ సరసన మాళవిక మోహనన్‌, రిద్ధికుమార్‌, నిధి అగర్వాల్‌ వంటి ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ తో రావడం ఇదే తొలిసారి కావడంతో డార్లింగ్ ఫ్యాన్స్లో మంచి క్యూరియాసిటీ పెరిగింది. ఈ క్రమంలో JAN9 రిలీజ్కు ఒక్కరోజే ముందుగానే (జనవరి 8న) ఏపీ, ఓవర్సీస్ థియేటర్స్లో రాజాసాబ్ ప్రదర్శించారు. మరి సినిమాకు వచ్చిన మౌత్ టాక్ ఎలా ఉంది? సోషల్ మీడియాలో ఆడియన్స్ ఏం మాట్లాడుకుంటున్నారు? అనేది ఓ లుక్కేద్దాం..  

‘ది రాజా సాబ్’ సినిమా నిడివి 3 గంటల 9 నిమిషాల రన్‌టైమ్తో వచ్చింది. కథ హారర్ వాతావరణంతో ప్రారంభమవుతుంది. ప్రభాస్ ఎంట్రీ మాత్రం సింపుల్‌గా ఉంటూ కథలోకి నేచురల్‌గా తీసుకెళ్తుంది. ‘‘ఈ చిత్రం కనిపించకుండా పోయిన తన తాత కనకరాజు కోసం, ప్రభాస్ చేసే అన్వేషణే సినిమా మెయిన్ కాన్సెప్ట్. ఒక దురాశపరుడైన ఓ యువకుడు, తన తాతకు చెందిన పాత భవనాన్ని అమ్మేయాలని చూస్తాడు. కానీ అది దెయ్యాల నివాసమని తెలుసుకుంటాడు. ఆ తర్వాత జరిగే సంఘటనలే’’ ఈ సినిమా కథ.

హారర్, ఫాంటసీ, యాక్షన్, కామెడీ అన్నీ కలిపి ఎంటర్‌టైన్ చేసేలా సినిమా సాగుతుంది. ఫస్ట్ హాఫ్‌లో దర్శకుడు హారర్‌తో పాటు కామెడీ, కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ చేస్తూ ఆడియన్స్‌ను ఎంగేజ్ చేయడానికి ప్రయత్నించాడు. ప్రభాస్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో కథను తన భుజాలపై మోసే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా రెబల్ స్టార్ ఇంట్రడక్షన్ సీన్ అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

అలాగే, సంజయ్ దత్ ఎంట్రీ సీన్ చాలా భయానకంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ హారర్ ఫీల్‌ను మరింత పెంచిందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి, ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా ఉందని పలువురు ట్విటర్ (ఎక్స్) వేదికగా తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్‌పై అంచనాలు పెరిగేలా సినిమా ప్రారంభ భాగం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సెకండ్ హాఫ్‌లో వచ్చే హాస్పిటల్ సీన్ బాగా వచ్చిందని, అలాగే చివరి 30 నిమిషాల క్లైమాక్స్ మూవీకి పెద్ద ప్లస్‌గా నిలిచిందని టాక్ వినిపిస్తోంది. క్లైమాక్స్‌ను మారుతి అత్యద్భుతంగా తెరకెక్కించాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా దెయ్యానికి ప్రభాస్ భయపడే సన్నివేశాలు ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తున్నాయని సమాచారం.

ప్రభాస్ కామెడీ టైమింగ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్‌గా మారిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. మ్యూజిక్ విషయానికి వస్తే, థమన్ 100 శాతం డ్యూటీ చేశాడని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్‌బంప్స్ తెప్పిస్తోందంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి, ‘ది రాజా సాబ్’ బ్లాక్‌బస్టర్ అంటూ రెబల్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఫుల్ రన్‌లో సినిమా ఎలాంటి కలెక్షన్లు సాధిస్తుందో చూడాల్సి ఉంది.

సినిమా చూసిన ఒక నెటిజన్ రివ్యూ షేర్ చేసి, తన అభిప్రాయం పంచుకున్నారు.   

కథ-ఒక దురాశపరుడైన ఓ యువకుడు, తన తాతకు చెందిన పాత భవనాన్ని అమ్మేయాలని చూస్తాడు. కానీ అది దెయ్యాల నివాసమని తెలుసుకుంటాడు. ఆ తర్వాత జరిగే సంఘటనలే ఈ సినిమా కథ. హారర్, ఫాంటసీ, యాక్షన్, కామెడీ అన్నీ కలిపి ఎంటర్‌టైన్ చేసేలా సినిమా సాగుతుంది.

దర్శకత్వం:

డైరెక్టర్ మారుతి కథను క్లియర్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించాడు. మాస్ సీన్స్‌తో పాటు భయపెట్టే సన్నివేశాలను బ్యాలెన్స్ చేస్తూ సినిమా మొత్తం ఆసక్తిగా నడిపించాడు.

బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ & సాంగ్స్:

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్. ముఖ్యంగా హారర్, యాక్షన్ సీన్స్‌లో గూస్‌బంప్స్ వస్తాయి. పాటలు ఓకే అనిపిస్తాయి కానీ BGM సినిమాప్ సౌండ్ ను మరింత పెంచింది. 

నటీనటుల నటన:

ప్రభాస్ రెండు షేడ్స్‌లో అదరగొట్టాడు. స్టైల్, స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్. సంజయ్ దత్ పూర్తిగా సర్ప్రైజ్ ప్యాకేజ్. ప్రభాస్‌తో ఆయన ఫేస్ ఆఫ్ సీన్స్‌కి థియేటర్‌లో చప్పట్లు పడతాయి.

ఫస్ట్ హాఫ్:

ఫన్, ఫాస్ట్ పేస్, బాగా ఎంగేజ్ చేస్తుంది.

సెకండ్ హాఫ్:

పూర్తి మాస్ మోడ్. కొద్దిగా స్లో మోమెంట్స్ ఉన్నా ఫ్లో కొనసాగుతుంది.

క్లైమాక్స్:

చివరి 30 నిమిషాలు సినిమాకు ప్రాణం. ఎమోషన్, యాక్షన్, మాస్ ఎలివేషన్స్ అన్నీ కలిపి ప్రేక్షకులకు పండగే.

మరో నెటిజన్ మూవీ రివ్యూ షేర్ చేస్తూ.. 

కథ & ప్రెజెంటేషన్: సినిమా కథ ఐడియా బాగుంది. కొన్ని సన్నివేశాలు, ముఖ్యంగా ప్రీ–క్లైమాక్స్ బాగానే వర్క్ అయ్యాయి. కానీ ఎక్కువ భాగంలో పాత తరహా కమర్షియల్ ఎలిమెంట్స్ వల్ల ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి.

దర్శకత్వం & స్క్రీన్‌ప్లే: మారుతి స్క్రీన్‌ప్లే స్పష్టత లేకుండా, చెల్లాచెదురుగా అనిపిస్తుంది. ఎడిటింగ్ కూడా సరిగ్గా కుదరకపోవడంతో కథ ఫ్లో బ్రేక్ అవుతుంది.

నటీనటుల నటన: చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఎనర్జిటిక్ పాత్రలో కనిపించడం ప్లస్ పాయింట్. ఆయనే ఈ సినిమాకు పెద్ద బలం. మిగతా పాత్రలు పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి.

టెక్నికల్ అంశాలు: వీఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల బాగున్నా, మరికొన్ని చోట్ల నిరాశపరుస్తాయి. థమన్ మ్యూజిక్ సినిమాను ముందుకు నడిపించే ప్రయత్నం చేసింది.

మొత్తానికి కొత్త కాన్సెప్ట్‌ని స్టార్ హీరోతో చేయడం అభినందనీయమే. కానీ దాన్ని ఆకట్టుకునేలా చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఆశించిన ఎమోషనల్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇంపాక్ట్ రాలేదు.

ఓవరాల్ గా : హారర్–ఫాంటసీ కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉన్నా, సరైన స్క్రీన్‌ప్లే లేకపోవడం వల్ల సినిమా పూర్తిగా ఎంగేజ్ చేయలేకపోయింది అని తన ఫీలింగ్ వ్యక్త పరిచారు.