2007 World Cup: అప్పుడు వరల్డ్ కప్ హీరో.. ఇప్పుడు రియల్ హీరో.. వీధుల్లో గస్తీ కాస్తున్న టీమిండియా మాజీ క్రికెటర్

2007 World Cup: అప్పుడు వరల్డ్ కప్ హీరో.. ఇప్పుడు రియల్ హీరో.. వీధుల్లో గస్తీ కాస్తున్న టీమిండియా మాజీ క్రికెటర్

టీమిండియా మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ ఆడింది కొన్ని మ్యాచ్ లే అయినా అతని పేరు ఇండియా మొత్తం గుర్తుంటుంది. దానికి కారణం 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫైనల్‌లో పాకిస్తాన్ గెలవడానికి ఆరు బంతుల్లో 13 పరుగులు అవసరమైనప్పుడు.. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జోగిందర్ శర్మకు బౌలింగ్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు. అయితే ధోనీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని జోగిందర్ నిలబెట్టుకున్నాడు. పాకిస్థాన్ గెలవాలంటే చివరి ఓవర్లో 13 పరుగులు చేయాలి. ఈ దశలో తొలి బంతిని ఒత్తిడిలో జోగిందర్ వైడ్ బాల్ వేయడంతో 6 బంతుల్లో 12 పరుగులు చేయాల్సి వచ్చింది ఆ తర్వాత బంతికి పరుగులు రాలేదు.    

4 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన మిస్బా ఉల్ హక్ ను ఔట్ చేసి భారత్ కు వరల్డ్ కప్ అందించాడు. ఈ ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసిన జోగిందర్ దేశవ్యాప్తంగా ఒక్కసారిగా మారుమ్రోగిపోయాడు. వరల్డ్ కప్ తర్వాత భారత జట్టులో అతనికి స్థానం లభించలేదు. అయితే ఆయన క్రికెట్ వదిలేసిన తర్వాత 2024లో హర్యానాలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా బాధ్యతలు చేపట్టాడు. 2007లో ప్రపంచ కప్ గెలిచిన వెంటనే హర్యానా ప్రభుత్వం అతన్ని DSPగా నియమించింది.పోలీస్ అయిన తర్వాత ధోనీతో ఫోటో దిగడం విశేషం. 

ALSO READ : గోల్డెన్ ఛాన్స్ ఎవరికి: వరల్డ్ కప్‌కు తిలక్ డౌట్.. రేస్‌లో ముగ్గురు క్రికెటర్లు

స్పోర్ట్స్ కోటాలో జోగిందర్ పోలీస్ ఉద్యోగం సంపాదించాడు. ప్రస్తుతం జోగిందర్ హర్యానా వీధుల్లో తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నాడు. గస్తీ కాస్తూ పవర్ ఫుల్ పోలీస్ గా తయారయ్యాడు. స్పోర్ట్స్ కోటాలో జోగిందర్ పోలీస్ ఉద్యోగం సంపాదించాడు. జోగిందర్ 2023లో క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం ధావన్, క్రిస్ గేల్ తో కలిసి లెజెండ్స్ లీగ్ ఆడుతున్నాడు. ఎగ్జిబిషన్ మ్యాచ్ ల్లో ఇప్పటికీ డెత్ ఓవర్లు బౌలింగ్ చేస్తున్నాడు. మార్చి 2025లో ఫిట్ ఇండియా కోసం ఢిల్లీలో 600 మందితో సైకిల్ తొక్కాడు. ఇండియా ఫిట్ గా ఉంటేనే విజయం సాధిస్తుందని దీని అర్ధం. వరల్డ్ కప్ ఫైనల్లో క్రికెట్ హీరోగా మారిన జోగిందర్ శర్మ ప్రస్తుతం రియల్ హీరోగా పోలీస్ బాధ్యతలు స్వీకరిస్తున్నాడు. జోగిందర్ శర్మది చాలా మందికి స్ఫూర్తినిచ్చే కథ.  

ALSO READ : ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్..