SA20: ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్.. RCB రిలీజ్ చేసిన స్టార్ బౌలర్ హ్యాట్రిక్

 SA20: ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్.. RCB రిలీజ్ చేసిన స్టార్ బౌలర్ హ్యాట్రిక్

సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ లుంగీ ఎంగిడి సౌతాఫ్రికా టీ20 లీగ్ లో తన బౌలింగ్ తో మ్యాజిక్ చేశాడు. డర్బన్ సూపర్ జెయింట్స్ పై హ్యాట్రిక్ తో సత్తా చాటాడు. బుధవారం (జనవరి 7) డర్బన్ వేదికగా కింగ్ మీద లో జరిగిన ఈ మ్యాచ్ లో ప్రిటోరియా క్యాపిటల్స్ తరపున ఆడుతున్న ఎంగిడి ఇన్నింగ్స్ 18 ఓవర్లో ఈ ఘనతను సాధించాడు. ఈ ఓవర్ తొలి బంతికి డేవిడ్ వీస్ ను ఔట్ చేసిన ఈ సఫారీ బౌలర్.. తర్వాత రెండు బంతులకు వరుసగా కొయెట్జి, నరైన్ లను గోల్డెన్ డకౌట్ గా ఔట్ చేసి హ్యాట్రిక్ పూర్తి చేశాడు. చివరి మూడు ఓవర్లలో డర్బన్ 44 పరుగులు చేయాల్సిన దశలో 18 ఓవర్లో ఎంగిడి హ్యాట్రిక్ తీసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. 

ALSO READ : 4-1తో ఆస్ట్రేలియాదే యాషెస్..

ఐపీఎల్ 2025 సీజన్ లో లుంగీ ఎంగిడి రాయల్ ఛాలెంజర్స్ జట్టు తరపున ఆడాడు. హేజాల్ వుడ్ గాయపడడంతో కొన్ని మ్యాచ్ లాడిన ఈ స్పీడ్ స్టర్ బౌలింగ్ లో పర్వాలేదనిపించాడు. అయితే ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు ఆర్సీబీ ఎంగిడిని వద్దనుకుని రిలీజ్ చేసింది. దీంతో మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2 కోట్ల బేస్ ప్రైస్ కు దక్కించుకుంది. ఆర్సీబీ సౌతాఫ్రికా బౌలర్ ను రిలీజ్ చేయకుండా రిటైన్ చేసుకుంటే బాగుండేది అని కొంతమంది ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ జట్టులో స్టార్క్ తో పాటు ఎంగిడి కూడా ఉండడంతో ఆ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. 

ALSO READ : టీమిండియాకు ఊహించని షాక్..

ఈ మ్యాచ్ విషయానికి వస్తే  డర్బన్ సూపర్ జెయింట్స్ పై ప్రిటోరియా క్యాపిటల్స్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ షై హోప్ 69 బంతుల్లోనే 118 పరుగులు చేశాడు. హోప్ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. లక్ష్య ఛేదనలో డర్బన్ సూపర్ జెయింట్స్ 19.4 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌటైంది. జొస్ బట్లర్ 96 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసినా ఈ ఇంగ్లాండ్ స్టార్ కు సహకరించేవారు కరువయ్యారు.