IND vs NZ: టీమిండియాకు ఊహించని షాక్.. గాయంతో న్యూజిలాండ్ సిరీస్‌కు తిలక్ వర్మ దూరం.. వరల్డ్ కప్‌కు డౌట్

IND vs NZ: టీమిండియాకు ఊహించని షాక్.. గాయంతో న్యూజిలాండ్ సిరీస్‌కు తిలక్ వర్మ దూరం.. వరల్డ్ కప్‌కు డౌట్

టీ20 వరల్డ్ కప్ ముందు టీమిండియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ టీ20 వరల్డ్ కప్ ముందు గాయపడ్డాడు. బుధవారం (జనవరి 7) విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా రాజ్ కోట్ తో మ్యాచ్  ఆడుతుండగా తిలక్ వర్మకి గజ్జల్లో గాయమైంది. తిలక్ వర్మ కోలుకోవడానికి మూడు వారాల సమయం పడుతుంది. దీంతో వరల్డ్ కప్ ముందు న్యూజిలాండ్ తో జరగబోయే టీ20 సిరీస్ కు తిలక్ వరం దూరమయ్యాడు. ఇప్పుడు తిలక్ వరల్డ్ కప్ సమయానికి కోలుకుంటాడా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. 

తిలక్ వరం గాయం గురించి బీసీసీఐ వర్గాలు ఇలా చెబుతున్నాయి.. " తిలక్ గాయం నుంచి కోలుకోవడానికి మూడు నుంచి నాలుగు వారాల సమయం పడుతుంది. జనవరి 31న న్యూజిలాండ్ తో జరగబోయే చివరి టీ20 కి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. వరల్డ్ కప్ సమయానికి అతను ఖచ్చితంగా ఫిట్ గా ఉంటాడు. టీ 20 వరల్డ్ కప్ కు అందుబాటులో ఉంటాడని భావిస్తున్నాం". అని బీసీసీఐ అధికారులు తిలక్ వర్మ గాయం గురించి చెప్పుకొచ్చిన్నట్టు సమాచారం. 

సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జయదేవ్ షా తిలక్ వర్మ గాయం గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు.. "  గాయం తర్వాత తిలక్ ను వెంటనే గోకుల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ స్కాన్లలో అతనికి వృషణ టోర్షన్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేయాలని సూచించారు. తిలక్ సర్జరీ విజయవంతమైంది. ఇప్పుడు బాగానే ఉన్నాడు. అతను ఈ రోజు ఆసుపత్రి నుండి డిస్చార్జ్ అవుతాడు". అని అయన తెలిపారు. 

టీమిండియా జనవరి 21 నుంచి న్యూజిలాండ్ తో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. నాగ్‌పూర్‌లో ప్రారంభమయ్యే తొలి టీ20కి తిలక్ వర్మ స్థానంలో ఎవరు ఆడతారో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం టీమిండియా వన్డే జట్టు వైస్ కెప్టెన్ గా ఉన్న శ్రేయాస్ అయ్యర్ భారత జట్టులోకి తిలక్ వర్మ స్థానంలో ఎంపికయ్యే అవకాశం ఉంది.