Ashes 2025-26: 4-1తో ఆస్ట్రేలియాదే యాషెస్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ ఎవరికంటే..?

Ashes 2025-26: 4-1తో ఆస్ట్రేలియాదే యాషెస్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ ఎవరికంటే..?

ఇంగ్లాండ్ తో స్వదేశంలో జరిగిన ఐదు మ్యాచ్ ల యాషెస్ సిరీస్ ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. గురువారం (జనవరి 8) ఇంగ్లాండ్ తో ముగిసిన ఐదో టెస్టులో 5 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించి 4-1 తేడాతో యాషెస్ ను తమ ఖాతాలో వేసుకుంది. ఇంగ్లాండ్ విధించిన 160 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లకు కోల్పోయి ఆస్ట్రేలియా అలవోకగా ఛేజ్ చేసింది. తొలి మూడు టెస్టులో ఆస్ట్రేలియా గెలిస్తే.. నాలుగో టెస్ట్ లో ఇంగ్లాండ్ గెలిచింది. తాజాగా ముగిసిన ఐదో టెస్టులో ఆస్ట్రేలియా గెలిచి 4-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ కొట్టిన హెడ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. సిరీస్ మొత్తం బౌలింగ్ తో చెలరేగిన స్టార్క్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి. 

8 వికెట్ల నష్టానికి 302 పరుగులతో చివరి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 342 పరుగులకు ఆలౌటైంది. సెంచరీ హీరో బెతేల్ 142 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ తర్వాత 160 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా కొంచెం తడబడింది. తొలి వికెట్ కు ఓపెనర్లు 62 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చినా.. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోతూ వచ్చింది. 59 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోవడంతో 121 పరుగులకే సగం జట్టుకు కోల్పోయింది. ఈ దశలో గ్రీన్, క్యారీ కలిసి జాగ్రత్తగా ఆడుతూ జట్టుకు విజయాన్ని అందించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో టంగ్ మూడు వికెట్లు పడగొట్టాడు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 384 పరుగులకు ఆలౌటైంది. రూట్ 160 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. హ్యారీ బ్రూక్ (84), జెమీ స్మిత్ (46), విల్ జాక్స్ (27) కూడా రాణించగా.. కెప్టెన్ బెన్ స్టోక్స్ (0), బ్రైడన్ కార్స్ (1) ఫెయిలయ్యారు.  ఆస్ట్రేలియా బౌలర్లలో మైకేల్ నెసర్ 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 567 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. స్మిత్‌‌‌‌ (138), వెబ్‌‌‌‌స్టర్‌‌‌‌ (71 నాటౌట్‌‌‌‌) రాణించారు. కార్స్‌‌‌‌, టంగ్‌‌‌‌ చెరో మూడు, స్టోక్స్‌‌‌‌ రెండు వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్ బెతేల్ సెంచరీతో ఇంగ్లాండ్ 342 పరుగులకు ఆలౌటైంది. 160 పరుగుల స్వల్ప టార్గెట్ ను ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది.