టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ గాయపడ్డాడు. డొమెస్టిక్ క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్నప్పుడు ఈ హైదరాబాద్ క్రికెటర్ కు గజ్జల్లో గాయమైంది. తిలక్ ను హాస్పిటల్ సర్జరీ చేయడంతో మూడు నుంచి నాలుగు వారాల పాటు రెస్ట్ అవసరం. దీంతో స్వదేశంలో జనవరి 21 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ కు తిలక్ వర్మ దూరమయ్యాడు. వరల్డ్ కప్ ముందు టీమిండియాకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఒకవేళ వరల్డ్ కప్ సమయానికి ఈ తెలుగు కుర్రాడు ఫిట్ గా లేకపోతే అతని స్థానంలో ఎంపిక కావడానికి రేస్ లో ముగ్గురు క్రికెటర్లు ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం..
శ్రేయాస్ అయ్యర్:
తిలక్ వర్మ స్థానంలో ఎంపిక కావడానికి ప్రధానంగా రేస్ లో ఉంది శ్రేయాస్ అయ్యర్. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ పూర్తి ఫిట్ నెస్ సాధించాడు. ఇటీవలే జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో ఆడి ఫామ్ తో పాటు ఫిట్ నెస్ ను నిరూపించుకున్నాడు. అయ్యర్ కూడా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కావడంతో తిలక్ వర్మ స్థానంలో ఛాన్స్ దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2025 సీజన్ లో 600 పైగా పరుగులు చేసి సత్తా చాటాడు. పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేయడంతో పాటు దూకుడుగా ఆడగలడు. అయ్యర్ అనుభవం కూడా ఇండియాకు కలిసొస్తుంది.
ALSO READ : ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్..
శుభమాన్ గిల్:
పేలవ ఫామ్ తో టీమిండియా జట్టులో స్థానం కోల్పోయిన శుభమాన్ గిల్ కు మరోసారి భారత జట్టులో అవకాశం దక్కేలా ఉంది. గిల్ క్లాస్ ప్లేయర్. ఒక్కసారి ఫామ్ లోకి వస్తే ఈ పంజాబ్ ప్లేయర్ ను ఆపడం కష్టం. సౌతాఫ్రికాతో సిరీస్ వరకు జట్టులో వైస్ కెప్టెన్ గా కొనసాగిన గిల్ చెత్త ఫామ్ తో అనూహ్యంగా జట్టులో స్థానం కోల్పోయాడు. ఇప్పుడు తిలక్ వర్మకు గాయం కావడంతో ఆ స్థానంలో గిల్ ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఓపెనర్ కావడం గిల్ కు మైనస్ గా మారింది.
ALSO READ : 4-1తో ఆస్ట్రేలియాదే యాషెస్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ ఎవరికంటే..?
రిషబ్ పంత్:
టెస్ట్ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్న రిషబ్ పంత్.. కొంతకాలంగా భారత వన్డే, టీ 20 జట్టులో స్థానం దక్కించుకోలేకపోతున్నాడు. అయితే ఇప్పుడు గిల్ ముందు సువర్ణావకాశం. తిలక్ వర్మ గాయపడడంతో భారత జట్టులో ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయగలగడం.. వికెట్ కీపింగ్ లాంటి విషయాలు పంత్ కు అడ్వాంటేజ్ గా మారింది. 2024 టీ20 వరల్డ్ కప్ లో పంత్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసి పర్వాలేదనిపించాడు. ప్రస్తుతం ఫామ్ లో లేకపోయినా భారత జట్టు యాజమాన్యం అతనిపై నమ్మకముంచే అవకాశం ఉంది.
