- హెల్త్ హెడ్లకు ప్రభుత్వం ఆదేశం
హైదరాబాద్, వెలుగు: హెల్త్ డిపార్ట్ మెంట్ లోని హెచ్ వోడీల ఆఫీసుల్లో ఏండ్లుగా పాతుకుపోయిన ఉద్యోగులపై సర్కార్ ఫోకస్ పెట్టింది. హెడ్ ఆఫీసుల్లో నాలుగేండ్లకు పైబడి పనిచేస్తున్న వారు, డిప్యుటేషన్‌పై వచ్చి ఇక్కడే తిష్ట వేసిన ఉద్యోగుల వివరాలను వెంటనే పంపాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, వైద్య విధాన పరిషత్, డీఎంఈ, డీపీహెచ్, టీజీఎంఎస్ఐడీసీ ఆఫీసుల్లో పనిచేస్తున్న వారి పూర్తి వివరాలను నిర్ణీత ప్రొఫార్మాలో అందించాలని జాయింట్ సెక్రటరీ ఆయేషా మస్రత్ ఖానమ్ ఆదేశించారు. వీరిని బదిలీ చేసేందుకే ప్రభుత్వం అర్జెంట్‌గా ఈ డేటా సేకరిస్తున్నట్టు సమాచారం.
