The Raja Saab First Review: వింటేజ్ ‘డార్లింగ్’ ఈజ్ బ్యాక్.. బాక్సాఫీస్ వద్ద 'రాజా సాబ్' హారర్ జాతర ఎలా ఉందంటే?

The Raja Saab First Review: వింటేజ్ ‘డార్లింగ్’ ఈజ్ బ్యాక్.. బాక్సాఫీస్ వద్ద 'రాజా సాబ్' హారర్ జాతర ఎలా ఉందంటే?

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ లెక్కలు సవరించాల్సిందే. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ది రాజా సాబ్’ (The Raja Saab) థియేటర్లలో సందడి మొదలుపెట్టింది. ప్రభాస్‌ను సరికొత్త హారర్- కామెడీ జానర్‌లో చూసేందుకు అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు.  జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అయితే ఒక రోజు ముందుగానే జనవరి 8న సాయంత్రం నుంచే ఏపీ, ఓవర్సీస్ మార్కెట్లలో ప్రీమియర్ షోలు పడటంతో సోషల్ మీడియా అంతా ‘రాజా సాబ్’ మౌత్ టాక్‌తో హోరెత్తిపోతోంది.

కథా నేపథ్యం: రాజభవనం.. ఆత్మల వినోదం!

కథ విషయానికి వస్తే.. ఒక పాడుబడిన పురాతన బంగ్లా, దాని వెనుక ఉన్న రహస్యం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.  రాజ కుటుంబానికి చెందిన ప్రభాస్ (రాజా సాబ్) ఆ బంగ్లాకు వారసుడిగా ఎంట్రీ ఇస్తాడు.  తన నానమ్మతో కలిసి సాధారణ జీవితం గడపటం, తమ కుటుంబానికి చెందిన రాజభవనాన్ని అమ్మాలనుకున్న రాజా సాబ్ తన తాత ఆత్మతో చేసిన పోరాటం ఏమిటి? అయితే, ఆ భవనంలో గూడు కట్టుకున్న ఆత్మల గొడవ ఏంటి? ఈ క్రమంలో చోటు చేసుకున్న వింతలు, విశేషాలను దర్శకుడు మారుతి తన మార్క్ కామెడీతో, హారర్ ఎలిమెంట్స్‌తో వెండితెరపై ఆవిష్కరించారు అనేది మిగతా కథ..

Also Read : పురుషుల మనస్తత్వాన్ని వీధి కుక్కలతో పోల్చిన రమ్య

నటీనటుల పర్ఫార్మెన్స్

ఈ సినిమాకు అసలైన బలం, ప్రాణం ప్రభాస్. 'డార్లింగ్', 'బుజ్జిగాడు' చిత్రాల్లోని ప్రభాస్ ఎనర్జీని మళ్ళీ ఈ సినిమాలో చూడవచ్చు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్, డ్యాన్స్ మూమెంట్స్ థియేటర్లలో విజిల్స్ వేయిస్తున్నాయి. రాజా సాబ్ గెటప్‌లో ఆయన లుక్స్ అదిరిపోయాయి. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ , రిద్ధి కుమార్ గ్లామర్ పరంగా మెరిశారు. ప్రభాస్‌తో వీరి కెమిస్ట్రీ, ముఖ్యంగా సాంగ్స్ మాస్ ఆడియన్స్‌కు కంటి పండుగలా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో ముగ్గురు హీరోయిన్స్ తో ప్రభాస్ చేసే అల్లరి 'డార్లింగ్' సినిమా నాటి ప్రభాస్ ని గుర్తు చేస్తుందట. ప్రభాస్ ఎంట్రీ సీన్, కామెడీ, డ్యాన్స్ లు ఫ్యాన్స్ కి ఫీస్ట్ అట. ఫస్ట్ హాఫ్ చాలా సరదాగా సాగిపోయిందని అంటున్నారు.  సంజయ్ దత్ పాత్ర కథలో కీలక మలుపుగా నిలుస్తుంది. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ ల కామెడీ ట్రాక్ సెకండాఫ్‌లో రిలీఫ్ ఇస్తుంది.  ముఖ్యంగా ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయని.. ముఖ్యంగా క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు ప్రేక్షకులు.

థమన్ అదిరిపోయే BGM!

మారుతి ఒక మాస్ హీరోను హారర్ కామెడీలో చూపిస్తూనే, ఎక్కడా కమర్షియల్ హంగులు తగ్గకుండా జాగ్రత్త పడ్డారు. ఎస్.ఎస్. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) హారర్ సీన్స్‌లో భయాన్ని కలిగిస్తూనే, మాస్ సాంగ్స్‌లో ఎనర్జీని నింపింది. సినిమాటోగ్రఫీ, భారీ సెట్టింగ్స్ విజువల్స్ ని రిచ్‌గా మార్చాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు అడుగడుగునా కనిపిస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది.

సినిమాకు ప్లస్ .. మైనస్..

చాలా కాలం తర్వాత సీరియస్ రోల్స్ పక్కన పెట్టి ప్రభాస్ చేసిన అల్లరి ఫ్యాన్స్‌కు పెద్ద ట్రీట్ లా ఉంది.  ఇంటర్వెల్ బ్లాక్ సినిమాపై ఆసక్తిని పెంచితే, క్లైమాక్స్ ట్విస్టులు ఊహాతీతంగా ఉన్నాయి. ఇక మారుతి మార్క్ కామెడీతో పాటు హారర్ ఎలిమెంట్స్ సరిగ్గా మిక్స్ అయ్యాయంటున్నారు ప్రేక్షకులు. ప్రొడక్షన్ వాల్యూస్ ను పెంచేలా రాజభవనం సెట్,విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయంటున్నారు సినీ ప్రియులు. అయితే కొన్ని చోట్ల ల్యాగ్ అనిపించేలా కామెడీ సీన్స్ ఉన్నాయంటున్నారు. హారర్ జానర్‌లో అక్కడక్కడా కనిపించే రొటీన్ ఫార్ములా అనిపించేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయన్న  అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

 బాక్సాఫీస్ అంచనాలు

తెలంగాణలో ప్రీమియర్ షోలు లేకపోవడం ఫ్రాన్స్ లో కొంత నిరాశ కలిగించినా, ఏపీ, ఓవర్సీస్ టాక్ చూస్తుంటే ప్రభాస్ ఖాతాలో మరో భారీ హిట్ పడిందనే చెప్పాలి. 3 గంటల నిడివి ఉన్నప్పటికీ, ఎక్కడా బోర్ కొట్టకుండా మ్యాజిక్ చేశారని ప్రేక్షకులు చెబుతున్నారు.. సంక్రాంతి సీజన్ కావడం, ప్రభాస్ వింటేజ్ లుక్ తోడవ్వడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. 'ది రాజా సాబ్' ఒక ఫుల్ లెంగ్త్ హారర్-కామెడీ ఎంటర్‌టైనర్. ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకోవడానికి, కాస్త థ్రిల్ అవ్వడానికి ‘రాజా సాబ్’ బెస్ట్ ఛాయిస్ అంటున్నారు సినీ ప్రియులు..