ఏప్రిల్ 2, 3న ఏషియన్ టెక్స్‌‌‌‌టైల్స్ కాన్ఫరెన్స్

ఏప్రిల్ 2, 3న ఏషియన్ టెక్స్‌‌‌‌టైల్స్ కాన్ఫరెన్స్

హైదరాబాద్, వెలుగు: ప్రపంచస్థాయి13వ ఏషియన్ టెక్స్‌‌‌‌టైల్ కాన్ఫరెన్స్‌‌‌‌ను ఏప్రిల్​2, 3వ తేదీల్లో నిర్వహిస్తామని మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, శ్రీధర్ బాబు తెలి పారు. నోవాటెల్ హెచ్ఐసీసీలో జరిగే ఈ ప్రతిష్టాత్మక సదస్సులో వివిధ దేశాలకు చెందిన ఇండస్ట్రీ ప్రతినిధులు, అత్యాధునిక యంత్రాల సరఫరాదారులు, ప్రభుత్వ సం స్థల ఉన్నతాధికారులు పాల్గొంటారని చెప్పారు.

మంగళవారం సెక్రటేరియెట్‌‌‌‌లో కాన్ఫరెన్స్​ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను మంత్రులు ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే ఈ సదస్సుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్‌‌‌‌టైల్ ఇండస్ట్రీ (సీఐటీఐ) కో హోస్ట్‌‌‌‌గా వ్యవ హరిస్తుందని పేర్కొన్నారు. నిరుడు 12వ కాన్ఫరెన్స్‌‌‌‌ను ముంబైలో నిర్వహించారు.