అంత్యక్రియల తర్వాత పారేసిన దుప్పట్లతో బిజినెస్ చేస్తున్న వ్యక్తులు...

అంత్యక్రియల తర్వాత పారేసిన దుప్పట్లతో బిజినెస్ చేస్తున్న వ్యక్తులు...

ఎలాగైన డబ్బు సంపాదించాలనే ఆశ కావొచ్చు లేక ఈజీగా డబ్బు సంపాదించాలనే కోరికతో కావొచ్చు... కానీ ఇలాంటి పని చేసి డబ్బు సంపాదించాలని ఎవరు అస్సలు అనుకోరు... ఈ కాలంలో కొత్త కొత్త ఆలోచనలతో అప్ డేట్ అవుతూ బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే... ఈ ఐడియా వారికీ ఎలా వచ్చిందో తెలీదుగానీ... ఇలా చేసి కూడా డబ్బు సంపాదిస్తారా... డబ్బుల కోసం ఇంతటి పనులకైనా దిగజారుతారా అనేల ఆందోళన కలిగిస్తుంది. అసలు ఆ పని ఏంటి... డబ్బులు ఎలా సంపాదిస్తున్నారంటే...   

డెహ్రాడూన్ సమీపంలోని రాణిపోఖ్రి ప్రాంతంలో ఒక వింతైన, అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన వారు వాడిన పాత పరుపులు, దుప్పట్లను సేకరించి వాటిని మళ్లీ కొత్తవాటిలా మార్చి అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

Also Read : మహిళలు జాబ్ చేయడానికి ఇండియాలో బెస్ట్ సేఫ్ సిటీ ఇదే

సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు వారు వాడిన పరుపులను, దుప్పట్లను పారవేస్తుంటారు. అయితే నిందితుల్లో ఒకరైన సంజయ్ అనే వ్యక్తి, ఈ పాత పరుపులను సేకరించి సల్మాన్, హమీద్ అనే ఇద్దరికి కిలో రూ.30 చొప్పున అమ్మేవాడు.

వాళ్లిద్దరూ ఆ పాత పరుపులలో ఉన్న పత్తిని తీసి, దానికి కొంచెం కొత్త పత్తిని కలిపేవారు. అలా పత్తితో కొత్త పరుపులు కుట్టి షాపుల్లో ఎక్కువ ధరకు అమ్మేవారు. ఈ విషయం తెలియని ప్రజలు ఆ పరుపులను కొనేవారు.

 మరణించిన వారు వాడిన పరుపులను ఇలా వ్యాపారానికి వాడుకోవడం  మతపరమైన మనోభావాలను దెబ్బతీయడమేనని, పైగా ఇలాంటి పరుపుల వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఒక సంస్థ సభ్యుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దింతో పోలీసులు బిఎన్ఎస్ (BNS) సెక్షన్ 299 కింద కేసు నమోదు చేసి ముగ్గురిని జైలుకు పంపారు. విచారణలో పారేసిన పరుపులలు అమ్మడం ద్వారా వ్యాపారం చేశామని ముగ్గురు స్వయంగా అంగీకరించారు కూడా.