న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ యాజ్సర్వీస్(సాస్) సేవలు అందించే బెంగళూరు కంపెనీ అమాగి మీడియా ల్యాబ్స్ ఐపీఓ ఈ నెల 13–16 తేదీల్లో ఉంటుంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.1,788 కోట్లు సేకరించాలని భావిస్తోంది. ధరల శ్రేణిని రూ.343 నుంచి రూ.361 గా నిర్ణయించింది.
ఐపీఓలో రూ.816 కోట్ల విలువైన కొత్త షేర్లు, 2.7 కోట్ల షేర్ల ఓఎఫ్ఎస్ ఉన్నాయి. సమీకరించిన నిధుల్లో రూ.550 కోట్లను టెక్నాలజీ, క్లౌడ్ మౌలిక సదుపాయాల బలోపేతం కోసం వినియోగిస్తారు. కంపెనీ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.1,162 కోట్ల ఆదాయం సాధించింది.
