హైదరాబాద్ కేంద్రిత ఆక్సియమ్ గ్యాస్ ఐపీవో.. వచ్చే నెలలో లిస్టింగ్

హైదరాబాద్ కేంద్రిత ఆక్సియమ్ గ్యాస్ ఐపీవో.. వచ్చే నెలలో లిస్టింగ్

హైదరాబాద్​, వెలుగు: ఆటో ఎల్​పీజీ బంకులు నిర్వహించే హైదరాబాద్ కేంద్రీకృత కంపెనీ ఆక్సియమ్ గ్యాస్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఐపీఓకు రానుంది.   ఈనెల ఆఖరి వారంలో ఇది మొదలవుతుంది. లిస్టింగ్​వచ్చే నెలలో ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఐపీఓ ద్వారా రూ.40–45 కోట్లు సేకరిస్తామని పేర్కొన్నాయి.  

ఈ డబ్బును కార్యకలాపాల విస్తరణకు వాడుతుంది. ప్రస్తుతం తెలంగాణలో 11, మహారాష్ట్రలో ఎనిమిది, కర్ణాటకలో రెండు ఆటో ఎల్పీజీ స్టేషన్లను ప్రైమ్ ఫ్యూయల్ బ్రాండ్ పేరుతో నిర్వహిస్తోంది. 

ఎన్ఎస్ఈ ఎమర్జ్ నుంచి ఐపీఓ కోసం ప్రాథమిక అనుమతులు దక్కించుకుంది. రూ.ఐదు ముఖ విలువ కలిగిన 94,92,000 ఈక్విటీ షేర్లను జారీ చేస్తామని ఆక్సియమ్​ గ్యాస్​ ప్రకటించింది.