ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణతో రాష్ట్రంలోని మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోపోజు రమేశ్‌బాబు అన్నారు. రిజర్వేషన్లలో మాలలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కు విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించి రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని కోరారు. ఈ మేరకు రమేశ్‌బాబు గురువారం మీనాక్షి నటరాజన్ ను ఆమె ఆఫీసులో కలిసి మాలల సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా రమేశ్‌బాబు మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వల్ల నష్టపోయిన మాలలతో పాటు 26 కులాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ చట్టం 2025 ను సవరించి రిజర్వేషన్ల శాతాన్ని పెంచి, రోస్టర్ పాయింట్లను మార్చాలన్నారు.
