ఆస్తిలో 75శాతం సమాజానికే ..కొడుకు మరణంతో వేదాంత చైర్మన్ నిర్ణయం

ఆస్తిలో 75శాతం  సమాజానికే ..కొడుకు మరణంతో  వేదాంత చైర్మన్ నిర్ణయం

న్యూఢిల్లీ: వేదాంత  చైర్మన్ అనిల్ అగర్వాల్ తన కుమారుడు అగ్నివేశ్ ఆకస్మిక మరణం అనంతరం, తన సంపదలో 75శాతం కంటే ఎక్కువ భాగాన్ని సమాజానికి దానం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. “భారతదేశం ఏమీ లోటు లేని దేశం. ఎందులోనూ వెనకబడకూడదు’ అని అగ్నివేశ్  నమ్మాడు”అని ఆయన గుర్తు చేసుకున్నారు.  

‘‘ఏ పిల్లవాడూ ఆకలితో నిద్రపోకూడదు.  విద్య లేకుండా ఉండకూడదు. ప్రతి మహిళ తన కాళ్లపై తాను నిలబడాలి. ప్రతి యువకుడికి తగిన ఉపాధి దొరకాలి” అని అనిల్ అగర్వాల్‌‌‌‌ ఎక్స్‌‌‌‌లో  పోస్ట్ చేశారు.  అగ్నివేశ్ అమెరికాలో స్కీయింగ్ ప్రమాదం తర్వాత చికిత్స పొందుతూ మరణించారు.