తెలంగాణలో IDTR ఏర్పాటు చేయండి: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి పొన్నం విజ్ఞప్తి

తెలంగాణలో IDTR ఏర్పాటు చేయండి: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి పొన్నం విజ్ఞప్తి

న్యూఢిల్లీ లోని భారత్ మండపంలో నిర్వహించిన మంత్రుల సమావేశం, ట్రాన్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా తెలంగాణలో  డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IDTR) ఏర్పాటు చేయడానికి మద్ధతు ఇవ్వాల్సిందిగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్యమైన రవాణా అంశాలపై వివరమైన ప్రతినిధి పత్రాన్ని (Representation) సమర్పించారు.

కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసిన అంశాలు:

  • రాష్ట్రంలో డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IDTR) ఏర్పాటు, మద్దతు
  • రవాణా మౌలిక వసతుల అభివృద్ధి కోసం 175 కోట్ల రూపాయల సాస్‌సీ (SASC) నిధుల మంజూరు
  • మోటార్ వాహనాల చట్టంలో ప్రతిపాదిత సవరణలు, వాటి ప్రభావం గురించి చర్చ

తెలంగాణ రాష్ట్రంలో రహదారి భద్రత, డ్రైవర్ శిక్షణ, రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వ సహకారం అత్యవసరమనికేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన అంశాలను సానుకూలంగా పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు నితిన్ గడ్కరీ.