డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ కు బిగ్ రిలీఫ్ లభించింది. నవదీప్ పై నమోదైన డ్రగ్స్ కేసును హైకోర్టు కొట్టివేసింది. నవదీప్ తరపున హైకోర్టులో న్యాయవాది సిద్ధార్థ్ వాదనలు వినిపించారు. గుడిమల్కాపూర్ డ్రగ్స్ కేసులో ఎఫ్ఐఆర్ లో మాత్రమే నవదీప్ పై పెట్టారని హైకోర్టు తెలిపింది.నవదీప్ దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకలేదు కాబట్టి కేసును కొట్టివేస్తున్నామని తెలిపింది హై కోర్టు .
2023 అక్టోబర్ లో మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసులకు చిక్కిన నైజీరియన్ డ్రగ్ పెడ్లర్‌తో పాటు తెలుగు సినీ నిర్మాత వెంకటరత్నారెడ్డి, రాంచందర్‌లను విచారించడంతో నవదీప్ పేరు బయటపడింది. ఈ కేసులో నవదీప్ ను టీన్యాబ్ పోలీసులు 8 గంటలపాటు విచారించారు. ఈడీ అధికారులు ఏకంగా 9 గంటలు విచారణ చేశారు. నవదీప్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, వ్యాపారాలకు సంబంధించిన వివరాలను కూడా నార్కో టీం అడిగారు. ఈకేసులో నవదీప్ ను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు గతంలో ఆదేశాలిచ్చింది.
