సౌత్ ఇండియన్ బ్యాంకులో ఉద్యోగాలు.. కనీస డిగ్రీ ఉన్న నిరుద్యోగులకు మంచి ఛాన్స్..

సౌత్ ఇండియన్ బ్యాంకులో ఉద్యోగాలు.. కనీస డిగ్రీ ఉన్న నిరుద్యోగులకు మంచి ఛాన్స్..

సౌత్ ఇండియన్ బ్యాంక్ క్రెడిట్ అనలిస్ట్, లీడ్ అనలిస్ట్, ఇతర పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ జనవరి 17.

ఖాళీలు: క్రెడిట్ అనలిస్ట్, టెక్నికల్ మేనేజర్/ రీజినల్ టెక్నికల్ మేనేజర్, లీడ్ అనలిస్ట్ – రిస్క్ కంట్రోల్ యూనిట్. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 50 శాతం మార్కులతో సీఏ/ సీఎంఏ లేదా ఎంబీఏ (ఫైనాన్స్) లేదా కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. సీఏఐఐబీ లేదా రిటైల్ బ్యాంకింగ్​లో డిప్లొమా లేదా ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ కోర్స్ లేదా సర్టిఫైడ్ క్రెడిట్ ప్రొఫెషనల్ అర్హత కలిగి ఉండాలి. బ్యాంక్​/ఎన్‌బీఎఫ్‌సీ/ రేటింగ్ ఏజెన్సీలో క్రెడిట్ అనలిస్ట్​గా  కనీసం రెండేండ్ల అనుభవం ఉండాలి.

వయోపరిమితి (31.12.2025 నాటికి): 35 ఏండ్లు మించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. ఎలాంటి ఫీజు లేదు. 

అప్లికేషన్ ప్రారంభం: జనవరి 07.

లాస్ట్ డేట్: జనవరి 17. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు www.southindianbank.bank.in వెబ్​సైట్​ను సందర్శించండి.