- నాస్కామ్ అంచనా
న్యూఢిల్లీ: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత టెక్ రంగం 2026 ఆర్థిక సంవత్సరంలో 315 బిలియన్ డాలర్ల (సుమారు రూ.27.56 లక్షల కోట్లు) ఆదాయాన్ని సాధించనుందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) వెల్లడించింది. ఈ మొత్తం గత ఏడాదితో పోలిస్తే 6.1 శాతం ఎక్కువ. దీని రిపోర్టు ప్రకారం ఈసారి ఐటీ పరిశ్రమలో 1.35 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయి.
దీనివల్ల మొత్తం ఉద్యోగుల సంఖ్య 59.5 లక్షలకు చేరుతుంది. ఐటీ సర్వీసెస్ ఆదాయం 149 బిలియన్ డాలర్లకు పెరుగుతుంది. అమెరికా కంటే ఆసియా పసిఫిక్, మిడిల్ఈస్ట్ ప్రాంతాల్లో వృద్ధి వేగంగా ఉంది. దేశీయ మార్కెట్ లో కూడా 7.9 శాతం వృద్ధి కనిపిస్తోంది. జీసీసీలు కూడా విస్తరిస్తాయని నాస్కామ్ తెలిపింది.
