న్యాయం చేయాల్సిన పోలీసులే 420 అవతారం ఎత్తారు. చిల్లర చేష్టలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఇద్దరు ఎస్ఐలు చిల్లర చేష్టలతో ఓ మహిళాను నిండా ముంచారు. ఎస్ఐలుగా పని చేస్తున్న అన్నాదమ్ముళ్లు ఓ మహిళకు అధిక లాభాల ఆశ చూపి కోట్లాది రూపాయలు కాజేసి చివరకు ముఖం చాటేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపుతోంది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
బూర్గంపాడు మండలంసారపాకకు చెందిన భూక్యా కుమారి అనే మహిళకు 2023లో భద్రాచలంలో ఎస్ఐగా పనిచేసిన మహేశ్ తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో తాను చెప్పిన వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే తక్కువ కాలంలోనే 35 శాతం వరకు అధిక లాభాలు వస్తాయని మహేశ్ ఆమెను నమ్మించాడు. నమ్మించడానికి తన సోదరుడు ఖమ్మంకు చెందిన మరో ఎస్ఐ రాణా ప్రతాప్ ను రంగంలోకి దింపాడు. వీరిద్దరి మాటలు నమ్మి సదరు మహిళ విడతల వారీగా సుమారు రూ.1.82 కోట్లను పెట్టుబడిగా వారికి అందజే సింది. ఈ వ్యవహారంలో ఎస్ఐల తండ్రి చంద్రయ్య కూడా భాగస్వా మిగా ఉన్నట్లు ఆమె ఫిర్యాదులో తెలిపింది. బాధితురాలు భూక్య కుమారి ఫిర్యాదు మేరకు BNS 318 (4) , 316 (2) , 351 (2) , red with 3(5) సెక్షన్ల కింద బుర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
2014 లో చెప్పుల షాపు వ్యక్తిని గన్ తో బెదిరించిన ఘటనలోనూ ఎస్ఐపై ఖమ్మం వన్ టౌన్ లో కేసు నమోదైంది. భార్య ఆత్మహత్య చేసుకుని మృతి చెందడానికి కారకుడని జూలురుపాడులో కేసు నమోదవ్వడంతో జైలుకు వెళ్లొచ్చి సస్పెన్షన్ లో ఉన్నారు ఇద్దరు ఎస్సైలు. ఇప్పుడు మూడవ కేసు నమోదు కావడంతో నామ్స్ ప్రకారం రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
