తమిళనాడు వ్యాప్తంగా ప్రస్తుతం ‘జననాయగన్’ ఫీవర్ నడుస్తోంది. దళపతి, సీఎం విజయ్ నటించిన మోస్ట్ అవేటెడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘జననాయగన్’ రేపు (జూలై 23న) విడుదలకు సిద్ధమవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్స్ సందడి పీక్స్‌కు చేరుకుంది. విజయ్ సీఎం అయ్యాక వస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో కోలీవుడ్‌లో పండుగ వాతావరణం నెలకొంది. థియేటర్ల వద్ద భారీ కటౌట్లు, బ్యానర్లు, సంబరాలతో అభిమానులు సందడి చేస్తున్నారు. ఇదే సమయంలో తమిళనాడు సినీ, రాజకీయ వర్గాల్లో మరో అంశం హాట్ టాపిక్‌గా మారింది. సినిమా విడుదల హడావుడి కొనసాగుతుండగానే ఓ ఆలయ ఉత్సవంలో విజయ్-త్రిష ఫొటోలతో ఏర్పాటు చేసిన వివాదాస్పద ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఒకవైపు అభిమానుల మద్దతు, మరోవైపు విమర్శలతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అసలు ఆ ఫ్లెక్సీలో ఏముంది? ఎందుకు వివాదానికి దారితీసింది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అసలేం జరిగింది?
తమిళనాడులోని సేలం జిల్లా ఆత్తూర్ పెరియ మారియమ్మన్ ఆలయ ఆషాఢ (ఆడి) ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ డిజిటల్ ఫ్లెక్సీ తీవ్ర వివాదానికి దారితీసింది. ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలో హీరోయిన్ త్రిషను కిరీటం, ఆభరణాలతో దేవత రూపంలో సింహాసనంపై కూర్చున్నట్లు చిత్రీకరించగా, నటుడు విజయ్‌ను పది తలల రావణుడి బ్యాక్‌డ్రాప్‌తో ఆయన సిగ్నేచర్ పోజులో గ్రాఫిక్‌గా చూపించారు.
Salem, Tamil Nadu: A controversial banner put up during the Aadi festival of Periya Mariamman Temple in Attur, featuring actor Trisha Krishnan in a goddess-like depiction and Chief Minister C. Joseph Vijay with an alleged Ravana head backdrop, was removed by authorities. Attur… pic.twitter.com/QAphn7pbfA
— IANS (@ians_india) July 20, 2026
పవిత్రమైన ఆలయ ఉత్సవాల్లో సినీ ప్రముఖుల చిత్రాలను ఈ విధంగా ఉపయోగించడంపై భక్తులు, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఫ్లెక్సీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే స్పందించి బ్యానర్‌ను తొలగించారు. ఇద్దరు యువకులపై కేసులు నమోదు చేశారు. బ్యానర్ ఏర్పాటు చేసిన దుకాణ యజమాని గోకుల్, దానిని అమర్చిన చంద్రుపై చర్యలకు సిద్ధమయ్యారు పోలీసులు. అయితే, వాళ్లిద్దరూ పరారీలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది.
ఫ్లెక్సీ ఎందుకు వైరల్ అయింది?
ఈ ఫ్లెక్సీ వైరల్ కావడానికి ప్రధాన కారణం విజయ్, త్రిషల గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వ్యక్తిగత సంబంధాలపై వస్తున్న ఊహాగానాలే. వీరిద్దరూ పలు సందర్భాల్లో కలిసి కనిపించడంతో వివిధ రకాల ప్రచారం సాగుతోంది. అయితే, ఈ ప్రచారాలపై విజయ్ లేదా త్రిష అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు.
ALSO READ : సీఎం సినిమా థియేటర్‌లో రావడం అరుదు
అలాగే విజయ్ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన తర్వాత ఆయనకు సంబంధించిన ప్రతి అంశం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో 'జననాయగన్' సినిమా విడుదల సందర్భంగా ఈ ఫ్లెక్సీ మరింత వైరల్‌గా మారింది. కొందరు దీనిని అభిమానుల అత్యుత్సాహంగా పేర్కొంటుండగా, మరికొందరు వ్యంగ్యంగా రూపొందించిన బ్యానర్‌గా అభిప్రాయపడుతున్నారు.
ఇలా ఒకవైపు ‘జననాయగన్’ విడుదలతో తమిళనాడులో అభిమానుల సందడి కొనసాగుతుండగా, మరోవైపు ఈ వివాదాస్పద ఫ్లెక్సీ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అయితే, విజయ్-త్రిషల వ్యక్తిగత జీవితాలపై ప్రచారంలో ఉన్న విషయాలు ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించబడలేదు.
