హైదరాబాద్, వెలుగు: లగ్జరీ జ్యూయలరీ బ్రాండ్ హౌస్ ఆఫ్ రోజ్.. ప్రముఖ నటి, నిర్మాత లక్ష్మీ మంచు భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో ఆభరణాల ప్రదర్శన నిర్వహించనుంది. వచ్చే నెల 1–2 తేదీల్లో ఐటీసీ కోహినూర్ హోటల్‌లో జరిగే ఈ ప్రదర్శనకు ఆహ్వానం వచ్చిన వారికే ప్రవేశం ఉంటుంది. అత్యంత పరిమిత సంఖ్యలో ప్రైవేట్ అపాయింట్‌మెంట్లతో ఈ కార్యక్రమం జరగనుంది.
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఆభరణాల సేకర్తలు ఇందులో పాల్గొననున్నారు. హౌస్ ఆఫ్ రోజ్ రూపొందించిన అరుదైన సహజ వజ్రాలు, విలువైన రంగురాళ్లు, ప్రత్యేక ఆభరణాల కలెక్షన్‌ను అతిథులు చూడవచ్చని సంస్థ తెలిపింది.
