కాక్రోచ్ పార్టీ ఆందోళనలతో అట్టుడుకుతున్న ఢిల్లీ.. 16 మెట్రో స్టేషన్లు క్లోజ్

కాక్రోచ్ పార్టీ ఆందోళనలతో అట్టుడుకుతున్న ఢిల్లీ.. 16 మెట్రో స్టేషన్లు క్లోజ్

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలు తీవ్రతరం అవుతున్న క్రమంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఢిల్లీ ప్రభుత్వం ముందస్తు చర్యలకు దిగింది. ఢిల్లీలోని 16 మెట్రో రైల్వే స్టేషన్లను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) బుధవారం తాత్కాలికంగా మూసివేసింది. ఈ 16 మెట్రో స్టేషన్లలోకి ప్రయాణికులను అనుమతించడం లేదు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

దీంతో.. లోక్ కళ్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్, బారాఖంబా రోడ్, సుప్రీం కోర్ట్, సేవా తీర్థ, జనపథ్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, ఐటీఓ, ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, ఖాన్ మార్కెట్, జోర్ బాగ్, శివాజీ స్టేడియం మెట్రో స్టేషన్లను DMRC మూసివేసింది. అయితే.. రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ దగ్గర ఇంటర్‌ఛేంజ్ సౌకర్యం అందుబాటులో ఉంది.

నీట్–యూజీ పేపర్ లీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కాక్రోజ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ‘చలో పార్లమెంట్’ మార్చ్ ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. పోలీసుల ఆంక్షలు, భారీ వర్షాన్ని లెక్క చేయకుండా సోమవారం ఉదయాన్నే దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు, మద్దతుదారులు జంతర్ మంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నారు.

వీరితో పాటు పలువురు సినీ నటులు, రాజకీయ నేతలు, ప్రజాస్వామ్యవాదులు, హక్కుల కార్యకర్తలు ఈ మార్చ్ లో పాలుపంచుకున్నారు.  దీంతో జంతర్ మంతర్ వెళ్లే దారులన్నీ ఆందోళనకారులతోనే నిండిపోయాయి. ఇప్పటికీ విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.