కొల్చారం, వెలుగు: మెదక్ జిల్లా కొల్చారంలోని శ్రీ సత్యసాయి ఆగ్రో రైస్ మిల్లులో భారీగా ధాన్యం మాయమైంది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ శృతక్రీత, ఎంక్వైరీ ఆఫీసర్ కోటేశ్వర్ రావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ శశికాంత్ రెడ్డి, ప్రశాంత్ కుమార్, జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్ నిత్యానందం సోమవారం రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించారు.
2025-26 ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన 3029.960 మెట్రిక్ టన్నుల ధాన్యం (75,749 బ్యాగులు) తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీని విలువ రూ.7,17,79,752 ఉంటుందని తెలిపారు. మిల్లర్ డి. శ్రీనివాస్ పై ఈసీ యాక్ట్ -1955 6-ఏ కింద కేసు నమోదు చేశారు. కలెక్టర్ కు నివేదిక సమర్పించినట్లు జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్ నిత్యానంద్ తెలిపారు.
