ఏసీబీ వలలో  ఎలక్ట్రిసిటీ ఏఈ

ఏసీబీ వలలో  ఎలక్ట్రిసిటీ ఏఈ

మెహిదీపట్నం, వెలుగు: మాసాబ్‌‌ట్యాంక్ ఎలక్ట్రిసిటీ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్(ఏవో)గా పనిచేస్తున్న మామిడిశెట్టి శ్రీనివాస్‌‌రావు ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏసీబీ హైదరాబాద్ సిటీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ కథనం ప్రకారం.. మాసాబ్‌‌ట్యాంక్ కార్యాలయ పరిధిలోని ఓ వినియోగదారుడిపై కరెంటు మీటర్ ట్యాంపరింగ్ కేసు నమోదు చేస్తానని బెదిరించి, కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ.17 వేలు లంచం ఇవ్వాలని ఏఈ డిమాండ్ చేశాడు.

చివరకు రూ.16 వేలకు ఒప్పందం కుదిరింది. మంగళవారం ఉదయం బాధితుడు డబ్బులు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి శ్రీనివాస్‌‌రావును పట్టుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్‌‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.