విష్ణు విన్యాసంకు  యూత్‌‌‌‌ బాగా కనెక్ట్ అవుతారు 

విష్ణు విన్యాసంకు  యూత్‌‌‌‌ బాగా కనెక్ట్ అవుతారు 

ఆయ్, క లాంటి చిత్రాలతో హీరోయిన్‌‌‌‌గా గుర్తింపును తెచ్చుకున్న నయన్ సారిక తాజాగా ‘విష్ణు విన్యాసం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీవిష్ణు హీరోగా యదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో సుమంత్ జి నాయుడు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 27న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నయన్ సారిక చెప్పిన విశేషాలు.ఈ చిత్రంలో మనీషా అనే  కాలేజ్ లెక్చరర్  క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తాను.  ఈ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌కి చాలా షేడ్స్  ఉంటాయి. కొంచెం ఫీమేల్ డామినేటింగ్‌‌‌‌గా ఉంటుంది.  ఫస్ట్ హాఫ్‌‌‌‌లో అబ్బాయిలకి కాస్త చిరాకు కలిగిస్తుంది. దానికి కారణం ఏమిటో సెకండ్ హాఫ్‌‌‌‌లో రివీల్ అయిన తర్వాత ఆ పాత్రను అందరూ అర్ధం చేసుకుని ఇష్టపడతారు.

జీవితంలో చాలా బాధలు ఎదుర్కొన్న అమ్మాయిగా నటించా. శ్రీవిష్ణు కూడా లెక్చరర్‌‌‌‌‌‌‌‌గా నటించడంతో  మా మధ్య జరిగే ప్రేమకథకు  స్టూడెంట్స్, యూత్  బాగా కనెక్ట్ అవుతారు.  శ్రీవిష్ణుతో  వర్క్ చేయడం వెరీ ఫన్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్. ప్రేక్షకులను నవ్వించడం నిజంగా కష్టం. విష్ణు గారికి ఆ కామెడీ టైమింగ్  నేచురల్‌‌‌‌గా వచ్చేస్తుంది. ఆ విషయంలో ఆయన వెరీ టాలెంటెడ్. స్పాట్‌‌‌‌లో  ఇంప్రవైజ్ చేసే విధానం కూడా చాలా బాగుంటుంది.  డైరెక్టర్ మారుతి చాలా క్లారిటీ ఉన్న ఫిలిం మేకర్. నా పాత్రను బాగా డిజైన్ చేశారు. కథా బలంతో పాటు పాత్రలో ఇంపార్టెన్స్  ఉన్న  సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నా. ఇక  ప్రస్తుతం  ‘రాకాస’ సినిమా చేస్తున్నా. అది ఫాంటసీ కామెడీ. అలాగే ఒక కన్నడ సినిమా కూడా చేస్తున్నా’’.