ఐఆర్‌సీటీసీ కుంభకోణం..లాలూ కుటుంబంపై ఢిల్లీ కోర్టు కీలక వ్యాఖ్యలు

ఐఆర్‌సీటీసీ కుంభకోణం..లాలూ కుటుంబంపై ఢిల్లీ కోర్టు కీలక వ్యాఖ్యలు

ఐఆర్ సీటీసీ  స్కాంలో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, అతని కుటుంబంపై ఢిల్లీకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రైల్వే శాఖను లాలూ సొంత ఆస్తిలా  వాడుకున్నారని.. లాలూ కుటుంబం ఓ సిండికేట్ లా వ్యవహరించిందని పేర్కొంది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జీ షీటు ఆధారంగా..ఈ స్కాంలో  లాలూ కుటుంబ సభ్యులను  కుట్రదారులుగా పేర్కొంది. ఈ కుంభకోణంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు శుక్రవారం(జనవరి 9) ఆదేశించింది.

రైల్వేశాఖను లాలూ తన సొంత ఆస్తిలా వాడుకున్నారని..అధికారులు, సన్నిహితుల సహకారంతో  లాలూ కుటుంబం భూములను కొల్లగొట్టేందుకు రైల్వే ఉద్యోగాలతో బేరసారాలు నడిపారని ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే అన్నారు. ఈ కేసులో లాలూ ప్రసాద్,అతని కుటుంబ సభ్యులను సహా నిందితులను విడుదల చేయాలని చేసిన అభ్యర్థనను తిరస్కరించారు. ఈ కేసు విచారణను జనవరి 23కి వాయిదా వేసింది.