ప్యానిక్ క్రియేట్ చేయడంలో మోదీ మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నరు: ఎంపీ వంశీకృష్ణ

ప్యానిక్  క్రియేట్ చేయడంలో మోదీ మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నరు: ఎంపీ వంశీకృష్ణ

మోదీ పాలనలో దేశంలో ఆందోళన పరిస్థితులు  నెలకొన్నాయన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ.  దేశ వ్యాప్తంగా ఎల్పీజీ సంక్షోభంపై ఇవాళ పార్లమెంట్ ముందు ఇండియా కూటమి ఎంపీలు  నిరసనకు దిగారు. 

ఈ సందర్భంగా ... విపత్కర పరిస్థితులను తీసుకురావడంలో మోదీ మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారని ఎంపీ వంశీకృష్ణ విమర్శించారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయన్నారు.  రెండు వారాలుగా యుద్ధం జరుగుతుంటే మోదీ సైలెంట్ గా ఉన్నారని విమర్శించారు వంశీకృష్ణ.  భారత్ ఏం చర్యలు తీసుకుందో   మోదీ  చెప్పాలన్నారు. బీజేపీ నేతలు ముందుకొచ్చి ఎల్పీజీ కష్టాలపై ప్రజలకు క్లారిటీ ఇవ్వాలన్నారు.
 
ఇరాన్ యుద్ధంతో దేశ వ్యాప్తంగా సీఎన్జీ, ఎల్పీజీ కొరత ఏర్పడింది. దేశ వ్యాప్తంగా పలు చోట్ల హోటళ్లు, రెస్టారెంట్లు మూత పడ్డాయి.గృహ వినియోగదారులు గ్యాస్ కోసం ఏజెన్సీల ముందు గ్యాస్ సిలిండర్లతో క్యూ కట్టారు. సీఎన్జీ కోసం  వాహనదారులు రోడ్లపై క్యూకట్టారు.