హైదరాబాద్: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సత్త చాటుదామని, బల్దియాల్లో పట్టు సాధించి తీరుదామని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇవాళ గాంధీ భవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి చూపించామని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బొంద పెట్టి గుండు సున్నకు తీసుకువెళ్లామని అన్నారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించామని చెప్పారు. పంచాయతీల్లో మనం పూర్తి స్థాయిలో పట్టు సాధించామని అన్నారు. రాష్ట్రంలో రాబోయే మరో 8 ఏళ్లు మనమే అధికారంలో ఉండబోతున్నామని అందువల్ల స్థానిక సంస్థలలో మన పట్టు ఉంటేనే అభివృద్ధి చేస్తామన్నారు.రెండేండ్లలో ఒక్క ఎమ్మెల్యే రాలేదు తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా తన వద్దకు ప్రజా సమస్యల కోసం రాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వాళ్లకు రాజకీయ పదవులు కావాలే తప్ప ప్రజా సమస్యలపై పట్టింపు లేదని విమర్శించారు.
9 జిల్లాలో సీఎం సభలు
హైదరాబాద్: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై 9 జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్న ట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఫిబ్రవరిర 3న మహబూబ్ నగర్ తో సభలు ప్రారంభిం చి 9వ తేదీన ముగిద్దామని చెప్పారు. సభల సమన్వయ బాధ్యతను రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అప్పగిస్తున్నట్టుతెలిపారు. ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరా జన్, పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం లకు పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తున్నట్టు సీఎం తెలిపారు. ములుగులో నిర్వహించనున్న సభకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలను ఆహ్వానిస్తామని తెలిపారు. మండల కేంద్రాల్లో విస్తృతంగా నిరసన సభలు చేపట్టాలని, తాను ఒక మండలం బాధ్యత తీసుకుంటానని సీఎం అన్నారు.
