లాటిన్ అమెరికా దేశం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధీగా పట్టుకున్న కొద్ది రోజులకే ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వెనిజులాపై పూర్థి ఆధిపత్యం సాధించామని అన్నారు. వెనిజులా ఆయిల్ నిల్వలు పూర్తిగా తమ ఆధీనంలోకి వచ్చాయని.. ఇక నుంచి అమెరికా చాలా డబ్బు సంపాదిస్తుందని సంచలన ప్రకటన చేశారు.
న్యూయార్క్ టైమ్స్ తో మాట్లాడుతూ.. అమెరికా మున్ముందు మంచి రోజులు చూస్తుందని పేర్కొన్నారు ట్రంప్. వెనిజుల తాత్కాలిక ప్రసిడెంట్ డెల్సీ రోడ్రిగెజ్ ప్రభుత్వానికి శుభపరిణామం అని ట్రంప్ అన్నారు. వెనిజులాలో అమెరికన్ ఆయిల్ కంపెనీలు.. అక్కడి మౌలిక కల్పనలను పునర్మిస్తామని.. చెప్పారు. లాటిన్ అమెరికాను నడపడంలో తమపై ఎలాంటి భారం పడదని అన్నారు.
వెనిజులాను ఎన్నాళ్లు అధీనంలో ఉంచుకుంటారని అడిగిన ప్రశ్నకు.. మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది లేదా.. చాలా రోజులు అన్నట్లు ట్రంప్ చెప్పారు.
Also Read : ఈ తరం కుర్రోళ్ల అప్పుల వెనక షాకింగ్ నిజాలు.. డబ్బంతా వాటికే పెడుతున్నారంట
ఇటీవలే అమెరికా అధికారులు కూడా ఇలాంటి స్టేట్ మెంట్స్ చేశారు . వెనిజులాను యూఎస్ చాలా వరకు గుప్పెట్లో ఉంచుకుంటుందని.. కరాకస్ ఆయిల్ నిల్వలను, ఎగుమతులను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటామని తెలిపారు. వెనిజుల ఆయిల్ సెక్టార్ పై ఉన్న సాంక్షన్స్ ను ఎత్తివేయనున్నట్లు ప్రకటించారు.
క్రూడ్ ఆయిల్ వెలికితీయడం, అమ్మడం జరుగుందని.. అమెరికా ఎనర్జీ సెక్రెటరీ క్రిస్ వైట్ బుధవారం (జనవరి 07) అన్నారు. ముందుగా స్టోర్ చేసిన ఆయల్ అమ్ముకుని.. ఆ తర్వాత ఉత్పత్తి పెంచుతామని చెప్పారు.
