ఈ తరం కుర్రోళ్ల అప్పుల వెనక షాకింగ్ నిజాలు.. డబ్బంతా వాటికే పెడుతున్నారంట

ఈ తరం కుర్రోళ్ల అప్పుల వెనక షాకింగ్ నిజాలు.. డబ్బంతా వాటికే పెడుతున్నారంట

ప్రస్తుత కాలంలో ట్రెండ్ ఏదైనా అది 'జెన్ జెడ్' చుట్టూనే తిరుగుతోంది. ఆర్థిక వ్యవస్థ నుంచి సంగీత ప్రపంచం వరకు ప్రతి రంగం వీరి అలవాట్లను బట్టి భవిష్యత్తును అంచనా వేస్తోంది. అయితే ఈ తరం యువత ఖర్చు చేసే విధానం, అప్పులు చేసే తీరు ఇప్పుడు ఆర్థిక నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జెన్ జెడ్ యూత్ తీసుకుంటున్న పర్సనల్ లోన్స్ లో ఎక్కువ భాగం మ్యూజిక్ కాన్సెర్ట్‌ల కోసమే ఖర్చవుతున్నారని వెల్లడైంది.

అనుభవాల కోసమే ఆరాటం: 
గత తరాల వారు ఇల్లు, కారు వంటి ఆస్తుల కోసం అప్పులు చేస్తే.. జెన్ జెడ్ కుర్రోళ్లు మాత్రం 'అనుభవాల' (Experiences) కోసం అప్పులు చేస్తూ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ఎయిర్‌బిఎన్‌బి నివేదిక ప్రకారం.. ఈ తరంలో 62% మంది కేవలం సంగీత అనుభవాల కోసమే కొత్త ప్రదేశాలకు వెళ్తున్నారట. ప్రముఖ ఇన్వెస్టర్ సౌరభ్ ముఖర్జియా దీనిని 'మిమెటిక్ కోరిక' అని అన్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు లేదా ఇతరుల లైఫ్ స్టైల్ చూసి.. తాము కూడా అలాగే జీవించాలనే సాంస్కృతిక ఒత్తిడికి లోనై అనవసరమైన ఖర్చులు చేయటమే మిమెటిక్ అంటే. 

ALSO READ : చనిపోయిన కొడుకు ఆశయం కోసం..

సెలెక్టివ్ స్ప్లర్జింగ్: 
జెన్ జెడ్ ఫాలో అవుతున్న మరో వింత ట్రెండ్ 'సెలెక్టివ్ స్ప్లర్జింగ్'. అంటే కారు లేదా ఇల్లు వంటి పెద్ద కొనుగోళ్లను పక్కన పెట్టి.. చిన్నవైనా ఖరీదైన అనుభవాల కోసం డబ్బును పోగు చేయడం. ఒక కారు కొనే బదులు, క్యాబ్‌లో వెళ్లి మరీ VIP కాన్సెర్ట్ టికెట్ కొనేందుకు వీరు ఆసక్తి చూపుతారని రాజ్ షమానీ చెప్పారు. 2025 అంచనాల ప్రకారం జీవన వ్యయంతో పోలిస్తే జీతాల వృద్ధి 6 శాతం తక్కువగా ఉన్నప్పటికీ.. లగ్జరీ హాలిడేస్ కోసం పర్సనల్ లోన్ తీసుకోవడం అతిపెద్ద ట్రెండ్‌గా మారింది.

ALSO READ : దలాల్ స్ట్రీట్‌లో బ్లడ్‌బాత్

సౌరభ్ ముఖర్జియా మాత్రం జెన్ డెడ్ ఫాలో అవుతున్న ఈ ధోరణిని 'ప్రమాదకరమైనది' అని హెచ్చరిస్తున్నారు. ఒక ఇల్లు కొంటే అది బ్యాంకుకు చూపించడానికి ఆస్తిగా ఉంటుంది. కానీ ఖరీదైన కాన్సెర్ట్ టికెట్‌ను లేదా విహారయాత్ర అనుభవాన్ని కరెన్సీగా చూపలేము. "క్రిస్ మార్టిన్ వచ్చి మీ అప్పు తీర్చడు, మీరే తీర్చుకోవాలి" అంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ అనవసరమైన అప్పుల వల్ల భవిష్యత్తులో జెన్ జెడ్ భారీ 'డిఫాల్ట్' సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.