వేదంతా గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్.. కాస్త బిజినెస్ నాలెడ్జ్ ఉన్న వాళ్లకు సుపరిచతమైన పేరు ఇది. వేదాంతా, హిందుస్తాన్ జింక్ మొదలైన కంపెనీల అధిపతి. ఇండియాలో ఉన్న టాప్ 100 బిలియనీర్లలో ఒకరు. తనకున్న వేలకోట్ల రూపాయల సంపద డొనేట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. తన కొడుకు అగ్నివేశ్ అగర్వాల్.. అమెరికాలో చనిపోవడంతో.. తన కొడుకు ఆశయ సాధన కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
అమెరికాలో స్కైయింగ్ చేస్తూ (మంచుపై జారుతూ ఆడే ఒక ఆట) యాక్సిడెంట్ గురైన అగ్నివేశ్ అగర్వాల్.. ఆ తర్వాత న్యూయార్క్ లోని మౌన్ సినై హాస్పిటల్ లో చేరి కోలుకుంటున్న సమయంలోనే.. గురువారం (జనవరి 08) సడెన్ గా గుండెపోటుతో 49 ఏళ్ల వయసులో మరణించాడు. తన జీవితంలో అత్యంత చీకటి రోజుగా తండ్రి అనిల్ అగర్వాల్ అభివర్ణిస్తూ.. తన కొడుకు ఆశయ సాధనలో ముందుకు సాగుతానని ప్రకటించారు.
ALSO READ : నంబర్ 1 ట్యాక్స్ పేయర్ రష్మిక..
మనం ఒకటి తలిస్తే విధి మరొకటి తలుస్తుందని చెప్పినట్లుగా.. తమ కుటుంబ పరిస్థితి మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. కొడుకు అంటే తండ్రికంటే ముందే చనిపోవడం కాదని బాధను వ్యక్తం చేశారు అనిల్ అగర్వాల్.
1976 జూన్ 3న బిహార్ ఫ్యామిలీలో జన్మించిన అగ్నివేశ్ అగర్వాల్.. రాజస్థాన్ లోని మాయో కాలేజ్ లో చదువుకున్నాడు. మెటల్స్ బిజినెస్ లో ఫుజైరా గోల్డ్ (Fujeirah Gold) అనే కంపెనీని ఏర్పాటు చేసి ఆ తర్వాత.. హిందుస్థాన్ జింక్ కంపెనీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాడు. ఎంత సాధించినా తన కుమారుడు సింపుల్ గా, హంబుల్ గా, మానవత్వం నిండిన వ్యక్తిగా ఉండేవాడని.. క్రీడాకారుడిగా, మ్యుజీషియన్ గా, నాయకుడిగా.. ఒక సహచరుడిగా, స్నేహితుడిగా తనకు అండగా నిలిచాడని పేర్కొన్నాడు. కేవలం కొడుకు మాత్రమే కాదని.. తన గర్వం, తన బలం, తన స్నేహం, తన ప్రపంచం అంతా అగ్నివేశ్ అగర్వాల్ అని చెప్పాడు.
ALSO READ : కోటి కంటే ఖరీదైన ఇళ్లకే మస్త్ డిమాండ్..
కొడుకు ఆశయం కోసం:
తామిద్దరం ఒక కల కనేవాళ్లమని.. ఆ కల తీరకుండానే వెళ్లిపోవడం జీర్ణించుకోలేక పోతున్నట్లు చెప్పారు అనిల్ అగర్వాల్. ఈ దేశంలో ఏ ఒక్క చిన్నారి ఆకలితో పడుకోకూడదని.. చదువు నిరాకరించకూడదని.. ప్రతి మహిళ తన కాళ్లపై తాను నిలబడాలని.. ప్రతి భారత యువకుడికి మంచి ఉపాధి ఉండాలని తన కొడుకు కలలు కన్నట్లు చెప్పారు. తాము సంపాదిస్తున్న దానిలో 75 శాతం సమాజానికి డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ రోజు నుంచి ఆ వాగ్ధానం నిలబెట్టుకునేందుకు కష్టపడతానని.. సింపుల్ లైఫ్ లీడ్ చేస్తానని అన్నారు.
ALSO READ : టీసీఎస్ టెక్కీలకు షాకింగ్ వార్త..
ఈ దేశానికి అన్నీ ఉన్నాయి.. మనమెందుకు ముందంజలో ఉండకూడదని నాన్న అని అనేవాడని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు అనిల్ అగర్వాల్. చాలా కలలు, లక్ష్యాలు తీరకుండానే చనిపోయాడని.. తన కొడుకు లేని జీవితాన్ని ఎలా జీవించాలో తెలియటం లేదని.. కానీ తన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తానని.. తన కొడుకుకు చివరి సందేశాన్ని రాస్తున్నట్లు పేర్కొన్నారు.
