T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026లో సూపర్-8 దశలో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా ముందుగా బ్యాటింగ్ కి దిగింది. బ్యాటింగ్ చేస్తున్న ప్రోటీస్ జట్టుకు ప్రారంభ ఓవర్లలోనే టీమిండియా బౌలర్లు అర్ష్ దీప్ సింగ్, జస్ ప్రీత్ బుమ్రాలు బిగ్ షాక్ ఇచ్చారు.
సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్ ప్రారంభించిన మొదటి ఓవర్లోనే అర్ష్ దీప్ బౌలింగ్ లో కేవలం 4 పరుగుల మాత్రమే వచ్చాయి. ఇక సెకండ్ ఓవర్ వేసిన బుమ్రా ఓవర్ 4వ బంతిని ఫోర్ కొట్టిన ప్రోటిస్ జట్టు ఓపెనర్ క్వింటన్ డి కాక్ ( 6), ఆ తర్వాత బాల్ కే క్లిన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో రెండో ఓవర్లో మొత్తం 6 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు జస్ప్రీత్ బుమ్రా. సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ మరోసారి విఫలం అయ్యాడు. మూడో ఓవర్ వేసిన అర్ష్ దీప్ బౌలింగ్ లో మార్క్రామ్ హర్థిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.
ఐడెన్ మార్క్రామ్ ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన ర్యాన్ రికెల్టన్ బ్యాటింగ్ కి వచ్చిన వెంటనే మంచి ఊపు మీద కనిపించాడు. ఒక సిక్స్ కొట్టిన తర్వాత జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో శివమ్ దూబేకి క్యాచ్ ఇచ్చి డకౌట్ కి చేరుకున్నాడు. ఇక అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్ టీమిండియా బౌలర్లు విరుచుకు పడుతున్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికా 10 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది.
