ఇరాన్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, అక్కడ ఉన్న భారతీయ పౌరులు వీలైనంత త్వరగా దేశాన్ని విడిచి ఇండియాకి రావాలని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫిబ్రవరి 23న టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం (Embassy) ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఇరాన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు అందుబాటులో ఉన్న విమానాలు లేదా ఇతర మార్గాల ద్వారా వెంటనే భారతదేశానికి తిరిగి రావాలని ప్రభుత్వం కోరింది. నిరసనలు, గొడవలు జరిగే ప్రాంతాలకు అస్సలు వెళ్లవద్దు. స్థానిక వార్తలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి.
ఇంకా రాయబార కార్యాలయంలో పేరు రిజిస్టర్ చేసుకోని వారు వెంటనే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ అక్కడ ఇంటర్నెట్ సమస్య ఉంటే, భారతదేశంలోని మీ కుటుంబ సభ్యుల ద్వారా ప్రాసెస్ పూర్తి చేయించవచ్చు. మీ పాస్‌పోర్ట్ ఇంకా ఇతర ముఖ్యమైన ట్రావెల్ పేపర్స్ ఎప్పుడూ మీ దగ్గరే రెడీగా ఉంచుకోండి.
ALSO READ : డ్రగ్ మాఫియా డాన్ మృతితో తగలబడుతున్న మెక్సికో
ఎందుకు ఈ హెచ్చరిక?
ఇరాన్‌లో విద్యార్థుల నేతృత్వంలో నిరసనలు తీవ్రమవుతున్నాయి. మరోవైపు అణు చర్చల విషయంలో ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల ఈ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అనిశ్చితి నెలకొంది. అందుకే ముందుజాగ్రత్తగా భారతీయులను సురక్షిత ప్రాంతాలకు రావాలని కోరుతున్నారు.
అత్యవసర సహాయం కోసం ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్‌లు : +989128109115; +989128109109; +989128109102; +989932179359. ఇమెయిల్: cons.tehran@mea.gov.in" ద్వారా సంపారించవచ్చు.
