ఉచితంగా స్నాక్స్: పదో తరగతి విద్యార్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

ఉచితంగా స్నాక్స్: పదో తరగతి విద్యార్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతోన్న టెన్త్ స్టూడెంట్స్‎కు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు సాయంత్రం వేళ ఉచితంగా స్నాక్స్ అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ బుధవారం (జనవరి 7) ఉత్తర్వులు జారీ చేశారు. 

ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు మొత్తం 19 రోజుల పాటు విద్యార్థులకు స్నాక్స్ అందించనున్నారు. స్నాక్స్ కోసం ప్రభుత్వం రూ.4.23 కోట్ల నిధులు మంజూరు చేసింది. కాగా, మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12:50 వరకు ఎగ్జామ్ జరగనుంది.

టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్:

  • మార్చి 14న ఫస్ట్ లాంగ్వేజ్
  • మార్చి 18న సెకండ్ లాంగ్వేజ్
  • మార్చి 23న థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్ )
  • మార్చి 28న మ్యాథ్స్
  • ఏప్రిల్ 2న సైన్స్ పార్ట్ 1, (ఫిజికల్ సైన్స్)
  • ఏప్రిల్ 7న సైన్స్ పార్ట్ 2( బయోలాజికల్ సైన్స్)
  • ఏప్రిల్ 13న సోషల్ స్టడీస్
  • ఏప్రిల్ 15న: ఒకేషనల్ కోర్స్, ఓఎస్ఎస్  మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1
  • ఏప్రిల్ 16న  ఓఎస్ఎస్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2