ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం చకచకా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు పలు శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో వాలంటీర్ల సేవలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాలంటీర్లకు విద్యార్హత నిర్ణయించి వారిని కొనసాగించే దిశగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.వైసీపీ ప్రభుత్వంలో రాజీనామాలు చేసిన వాలంటీర్లకు తిరిగి అవకాశం ఇస్తారా లేదా అనేది కీలకంగా మారనుంది.
ఎన్నికలకు ముందు వైసీపీ కోసం రాజీనామా చేసిన వారు ఇప్పుడు తిరిగి విధుల్లో చేరేందుకు ముందుకు వస్తున్నారు. వీరి విషయంలో చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.ఈ క్రమంలో వాలంటీర్లను గత ప్రభుత్వం పథకాల అమలు కోసం ప్రధానంగా వినియోగించుకుంది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వీరి సేవలకు పరిమితులు విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి, రాజీనామా చేసిన వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.