IPL 2026: గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ కోచ్‌గా ఆసీస్ విధ్వంసకర CSK మాజీ ఆటగాడు 

IPL 2026: గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ కోచ్‌గా ఆసీస్ విధ్వంసకర CSK మాజీ ఆటగాడు 

IPL 2026: ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం మాథ్యూ హేడెన్  ను త్వరలో ( మార్చి 28న) ప్రారంభం అయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ కోసం గుజరాత్ టైటాన్స్‌ బ్యాటింగ్ కోచ్‌గా నియమించినట్లు ఫ్రాంచైజీ ఈరోజు ( మార్చి 10వ తేదీన) ప్రకటించింది. రెండు సార్లు వరల్డ్ కప్ గెలిచిన బ్యాటర్ హేడెన్, ఆస్ట్రేలియా తరఫున మొత్తం 273 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 15,000కి పైగా పరుగులు సాధించి, తన బలమైన ఆట శైలి ద్వారా ప్రసిద్ధి చెందారు.

కాగా మాథ్యూ హేడెన్ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 32 మ్యాచ్‌లు ఆడారు. 2010లో టీమ్ ని టైటిల్ గెలిపించగా, 2009లో 12 మ్యాచ్‌ల్లో 572 రన్స్ చేసి ఆరెంజ్ కాప్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. హేడెన్ మాట్లాడుతూ..  సరైన బ్యాటింగ్ చేయడం వలన మనపై ఒత్తిడిని తగ్గిస్తుందని పేర్కొన్నారు. గొప్ప బ్యాటింగ్ ఆటపై పూర్తి స్థాయి ఆధిపత్యం చేలాయించేలా చేస్తుంది అన్నారు. ఇది గుజరాత్ టైటాన్స్‌లో మనం ఇదే ఫార్మాట్ తో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.  

గుజరాత్ టైటాన్స్ క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి మాట్లాడుతూ.. మథ్యూ హేడెన్ అత్యున్నత స్థాయిలో అనుభవం కలిగిన దిగ్గజ ఆటగాడు.. అలాగే యువ క్రికెటర్ లలో కలిగిన ప్రతిభను వెలికి తీసే మెంటర్ గాను ఆయనకు సామర్థ్యం ఉంది.. మన జట్టులోని ప్లేయర్స్ బ్యాటింగ్ ఐడెంటిటీని వెలుగులోకి తీసుకు రావడంలో హేడెన్ ముఖ్య పాత్ర పోషించనున్నారు అంటూ పేర్కొన్నారు. కాగా, మార్చి 28వ తేదీ నుంచి ఈ క్యాష్ రీచ్ లీగ్ ప్రారంభం కానుంది.