హైదరాబాద్, వెలుగు: ఇంటర్ క్లబ్ టీ20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఆతిథ్య సికింద్రాబాద్ క్లబ్ విజేతగా నిలిచింది. సోమవారం ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠగా జరిగిన ఫైనల్లో సికింద్రాబాద్ క్లబ్ 4 రన్స్ తేడాతో ప్రెస్ క్లబ్ టీమ్‌ను ఓడించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సికింద్రాబాద్ 20 ఓవర్లలో 195/8 స్కోరు చేసింది.
సీవీ మిలింద్ (35 బాల్స్‌లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 68) టాప్ స్కోరర్‌గా నిలవగా, అక్షత్ (40) కూడా రాణించాడు. ఛేజింగ్‌లో ప్రెస్ క్లబ్ చివరి వరకూ పోరాడి 191 రన్స్‌కే పరిమితం అయింది. ఓపెనర్ రత్న ( 67) టాప్ స్కోరర్. రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్ ఆయన కొడుకు మిలింద్ ఇద్దరూ విన్నర్ సికింద్రాబాద్ క్లబ్ టీమ్‌లో ఆడటం విశేషం.
