తిరుపతి జిల్లా యర్రావారిపాళెం మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో రెండు ఏనుగులు మృతి చెందాయి. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నైరబైలు పంచాయితీ పరిధిలో ఫారెస్ట్ బంగ్లా సమీపంలోని అటవీప్రాంతంలో ఈ ఘటన జరిగింది.. అడవి పందుల నుంచి పంట రక్షణ కోసం రైతులు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె తగిలి ఏనుగులు మృతి చెందాయి. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
