Bakrid Special 2024: ఇదే బక్రీద్ పండుగ వెనుక కథ!

Bakrid Special 2024: ఇదే బక్రీద్ పండుగ వెనుక కథ!

బక్రీద్ అని ప్రసిద్ధి చెందిన ఈద్-ఉల్-అధా ముస్లింల రెండు ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఈ పండుగను ముస్లింలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ ప్రాముఖ్యత ఏమిటి? దీని వెనుక ఉన్న చరిత్ర గురించి తెలుసుకుందాం. .

 ముస్లింల ప్రధాన పండగలు రంజాన్‌, రెండోది బక్రీద్. ఈ పండుగకు ఈద్-ఉల్-జుహా, ఈదుజ్జహా, లేక బక్రీద్ అని కూడా అంటారు. అయితే ఈసారి జూన్17న బక్రీద్ పండుగ రానుంది.ప్రపంచంలోని ప్రతి మూలలో ఉన్న ముస్లింలు రెండవ అత్యంత పవిత్రమైన ఇస్లామిక్ పండుగ ఈద్ అల్-అధాను జరుపుకుంటున్నారు. ఈద్ అల్-అధాను ఆనందం, చాలా ఉత్సాహంతో జరుపుకుంటారు. ఇస్లామ్ క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్‌హేజ్‌ 10వ తేదీన బక్రీద్ పండుగను ముస్లింలు జరుపుకుంటారు. ఇస్లామిక్ కమ్యూనిటీలో పండుగలు చంద్రుని దర్శనం తర్వాత జరుపుకుంటారు, 

బక్రీద్ అని కూడా పిలువబడే ఇస్లామిక్ పండుగ ఈద్-ఉల్-అధా, ఇస్లామిక్ చంద్ర నెల ధు అల్-హిజ్జా యొక్క పదవ రోజున  ఈ పండుగ జరుపుకుంటారు. బక్రీద్ పండుగ త్యాగాల సందేశాన్ని తెలియజేస్తుంది. దేవుడు చూపిన మార్గంలో నడవాలి అని ఈ పండగ తెలుపుతుంది. 

ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఈద్ అల్-అదా ఎల్లప్పుడూ ఒకే రోజున వస్తుంది, గ్రెగోరియన్ క్యాలెండర్ చాంద్రమాన సంవత్సరానికి బదులుగా సౌర సంవత్సరాన్ని ఉపయోగిస్తుంది, కాబట్టి ఈద్ అల్-అధా తేదీ ప్రతి సంవత్సరం మారుతుంది. బక్రీద్ పండుగ  పవిత్ర రంజాన్ మాసం తర్వాత 70 రోజుల తర్వాత జరుపుకుంటారు. చంద్రుని దర్శనం ద్వారా బక్రీద్ తేదీని నిర్ణయిస్తారు. ఈ పండుగ సందర్భంగా వివిధ పూజలు నిర్వహిస్తారు.

ముస్లింల విశ్వాసం ప్రకారం, హజ్రత్ ఇబ్రహీం భగవంతునిపై పూర్తి విశ్వాసం ఉన్న దేవుని సేవకుడు. ఒకసారి హజ్రత్ ఇబ్రహీం తన ప్రాణానికి ప్రాణమైన తన ప్రియమైన ఏకైక కుమారుడిని త్యాగం చేయాలని కల కంటాడు. హజ్రత్ ఇబ్రహీం ఈ కలను దేవుని సందేశంగా భావించి, ఈ కలను అల్లాహ్ చిత్తంగా అంగీకరించి, తన 10 ఏళ్ల కుమారుడిని దేవుని మార్గంలో బలి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అయితే కుమారుడిని బలి ఇచ్చే సమయానికి.. కుమారుడికి బదులు.. మేకను పెట్టి  మేకను బలి ఇవ్వమని అల్లా సూచించాడని చెబుతారు.

బక్రీద్ పండుగ సందర్భంగా మటన్ బిర్యానీ, మటన్ కుర్మా, మటన్ కీమా, షీర్ కుర్మా, కీర్ లాంటి వంటకాలను తయారు చేస్తారు.ఇతరత్రా వంటకాలు చేస్తారు. మృతి చెందిన వారి సమాధులను దర్శిస్తారు. సమాధులను అందంగా అలంకరిస్తారు. వారికిష్టమైన దుస్తులు, భోజనం అక్కడ ఉంచుతారు. స్వర్గంలో ఉన్న వారు వాటిని స్వీకరిస్తారని నమ్మకం. అన్ని గుణాల్లోనూ దానగుణమే ఉత్తమోత్తమమైనది. ఆకలి అనేది అందరి సమానమైనది కాబట్టి ఈ పండగకు నిరుపేద కుటుంబాలకు శక్త్యనుసారంగా దానధర్మాలు చేస్తూ కొంత కొంత మందికైన ఆకలి తీర్చగాలిగాం అని సంతృప్తి చెందుతారు.

బక్రీద్, ఈద్ అల్-అధా లేదా త్యాగాల పండుగ అని కూడా పిలుస్తారు, దీనిని ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకుంటారు. రోజు ఒక ప్రత్యేక ప్రార్థన సమావేశంతో ప్రారంభమవుతుంది, తరువాత జంతు బలి. సాధారణంగా మేక లేదా గొర్రెలకు వడ్డిస్తారు. ఇస్లాం మతంలోని ఐదు ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్‌ ‌తీర్థయాత్రను ముస్లింలు చేయవలసి ఉంటుంది. ఈ మాసం ప్రారంభంలోనే ముస్లిం ప్రజలు భక్తి ప్రపత్తులతో హజ్ తీర్థయాత్రకు బయలుదేరతారు.

హిజ్రీ అంటే ఏమిటి..?

బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అంటే జంతువని, ఈద్ అంటే పండుగని అర్థాలు ఉన్నాయి. జంతువును ఖుర్బాని ( దానం ) ఇచ్చే పండుగ కాబట్టి దీనిని ఈదుల్ ఖుర్బాని అని కూడా అంటారు. మహ్మదీయులు సంవత్సరాన్ని హిజ్రీ అనే పేరుతో పిలుసుకుంటారు. హిజ్రీ అంటే వలసపోవడం అని అర్థం. మహ్మద్ ప్రవక్త మక్కా నుండి మదీనాకు తరలివెళ్లడాన్ని హిజ్రీగా పేర్కొంటారు. ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలన్నది ఇస్లాం మత సూత్రాలలో ఇదొకటి. త్యాగనిరతితోపాటు మనోవాంఛ, స్వార్థం, అసూయ, రాగద్వేషాలను కూడా విడిచిపెట్టి మానవతను వెదజల్లాలన్నదే బక్రీద్ పండుగలోని ప్రధాన పరమార్ధం దాగిఉంది.

బక్రీద్ పండగను ఎందుకు జరుపుకుంటారు..?

హజ్ యాత్రకొరకు అరబ్ దేశమైన సౌదీ అరేబియా‌లోని మక్కా నగరానికి చేరుకుని మసీదులో ఉన్న కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి అక్కడ ప్రార్థనలు చేస్తారు. ఈ మసీదు కాబా గృహం చుట్టూ ఉంది. ప్రపంచంలోని ముస్లింలందరూ కాబా వైపు తిరిగి నమాజ్ ( ప్రార్థనలు ) చేస్తారు. దీనినే ఖిబ్లా అని కూడా అంటారు. హజ్ తీర్థయాత్రకు వెళ్ళినవారు మక్కా నుంచి మదీనా ( మహమ్మద్ ప్రవక్త గోరీ ఉన్ననగరం )ను సందర్శిస్తారు. అల్లాహ్ ఆదేశానుసారం ఇబ్రహీం తన ఏకైక పుత్రుడైన ఇస్మాయిల్‌ను బలి ఇవ్వడానికి సిద్ధమౌతాడు. ఆ సంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు.

ఖుర్బాని పరమార్థం ఇదే..

ఖుర్బాని అంటే పేదలకు మాంసాన్ని దానం ఇవ్వడం, త్యాగం అనే అర్థాలు ఉన్నాయి. ఖుర్బాని అంటే సాన్నిధ్యం, సామీప్యం, సమర్పణ, త్యాగం అని కూడా అర్థం. అంటే దైవ సాన్నిధ్యాన్ని పొందడం. దైవానికి సమర్పించడం. దైవం కోసం త్యాగం చేయడం అని భావం. అయితే, ఖుర్బాని ద్వారా రక్త మాంసాలు సమర్పించడం కాదని, రక్తం, ఇవి అల్లాకు చేరవని, భక్తి, పారాయణత హృదయంలో జనించే త్యాగభావం, భయభక్తులు మాత్రమే ఆయనకు చేరుతాయని ముస్లింల భావన. అంతే కాదు.. ప్రాణత్యాగానికైనా వెనుకాడడని ఇదే ఖుర్బాని పరమార్థమని ముస్లిం పెద్దలు కొందరు అంటారు. మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగం పేదల ప్రజలకు, రెండో భాగం తమ బంధువులకు, మరో భాగం తన కుటుంబం కోసం వినియోగిస్తారు.

ఖుర్బానిగా కోడిపుంజును ఇవ్వరాదు

ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు బక్రీద్ రోజున ఖుర్బాని ఇస్తారు. జిల్ హజ్ నెల 11, 12 రోజుల్లో కూడా కొన్ని చోట్ల ఖుర్భాని ఇస్తూనే ఉంటారని తెలుస్తుంది. ఖుర్భానిగా సమర్పించే జంతువులకు అవయవ లోపంలేని, ఆరోగ్యకరమైనవిగా ఉండాలి. ఒంటె, మేక లేదా గొర్రెను దైవమార్గంలో సమర్పించాలి. స్థోమత కలిగిన ప్రతి ముస్లిం దీనిని విధిగా ఆచరించాలి. అల్లా నియమ నిబంధనల ప్రకారం ఖుర్బానిగా కోడిపుంజును ఇవ్వరాదు. ఐదేళ్ల వయసు పై బడిన ఒంటె, రెండేళ్ల పై బడిన ఎద్దు, కనీసం ఏడాది వయసున్న మేక, గొర్రెలను బలి ఇవ్వాలి. ఖుర్భాని చేసే వ్యక్తీ వడ్డీతో కూడిన అప్పులు ఇవ్వడం, తీసుకోవడం చేయరాదు. ఈ నియమాలను తప్పక పాటిస్తారు.