మాల్దీవ్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు

మాల్దీవ్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు

భారత్, మాల్దీవుస్ దేశాల మధ్య ఇటీవల కాలంలో ద్వైపాక్షిక సంబంధాలు బాగా లేకున్నా.. ఇప్పడు చక్కబడుతున్నాయి. జూన్ 16(ఆదివారం) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాల్దీవ్ అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జుకు లేఖ రాశారు. ఈద్ అల్-అదా (బక్రీద్) పర్వదినాన్ని పురస్కరించుకొని ముయిజ్జూకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. జూన్ 9న మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, ప్రమాణస్వీకారానికి కూడా మయిజ్జూ వచ్చారు. గత కొన్ని రోజుల క్రితం మయిజ్జు చైనా అనుకూల వైఖరి ప్రదర్శిస్తూ భారత్ కు వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే..

కానీ.. ఇప్పుడు ఏర్పడిన ఫ్రెండ్లీ వాతావరణంతో ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు మళ్లీ వచ్చాయని తెలుస్తోంది. మాల్దీవుల గౌరవనీయ అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజ్జూ ప్రభుత్వానికి మరియు మాల్దీవుల రిపబ్లిక్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు అని మోదీ లేఖలో పేర్కొన్నారు. త్యాగం, కరుణ, సౌభ్రాతృత్వం విలువలు ఈ పండుగ ద్వారా మూర్తీభవించాయి. ఇవి శాంతియుత మరియు సమ్మిళిత ప్రపంచాన్ని నిర్మించడంలో ముఖ్యమైనవని మాల్దీవులలోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో రాసింది. ఆ దేశంలోని భారత రాయబారి కార్యాలయం కూడా  చైనా మాల్దీవ్స్ తో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకొని భారత్ ను దెబ్బకొట్టాలని చూస్తోంది.