డుంగురిసాహికి చేరుకున్న కరెంట్​పోల్స్​, ట్రాన్స్​ఫార్మర్స్​

డుంగురిసాహికి చేరుకున్న కరెంట్​పోల్స్​, ట్రాన్స్​ఫార్మర్స్​

భువనేశ్వర్​: ఎన్​డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము పూర్వీకుల ఊరికి కరెంట్ వచ్చింది. ముర్ము పేరును ప్రకటించగానే.. జాతీయ మీడియా మొత్తం ఆమె పూర్వీకుల ఊరైన మయూర్​భంజ్ జిల్లా ఉపర్​బెడాలోని డుంగురిసాహికు వెళ్లగా ఎన్నో సమస్యలు వెలుగులోకొచ్చాయి. అప్పటి వరకు నిర్లక్ష్యంగా 
వ్యవహరించిన ఒడిశా సర్కార్ వేగంగా స్పందించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులకు ఎంత విన్నవించుకున్నా.. ఆ గ్రామానికి కరెంట్ రాలేదు. ద్రౌపదీ ముర్ము, ఎన్​డీఏ రాష్ట్రపతి అభ్యర్థి అని ప్రకటించగానే.. ఆ గ్రామానికి టాటా పవర్​ నార్త్​  ఒడిశా డిస్ట్రిబ్యూషన్​ లిమిటెడ్​(టీపీఎన్​ఓడీఎల్) వర్కర్లు చేరుకున్నారు. 38 పోల్స్, 900 మీటర్ల కేబుల్, కండక్టర్లు, ట్రాన్స్​ఫార్మర్ల​తో పాటు కావాల్సిన మిషనరీతో వాలిపోయారు. అయితే ముర్ము ప్రస్తుతం అక్కడ నివాసం ఉండటం లేదు. ఉపర్​బెడాలోని డుంగురిసాహికి 20 కిలోమీటర్ల దూరంలోని రాయిరంగ్​పూర్​కు షిఫ్ట్ అయ్యారు. కుసుమి బ్లాక్​లోని ఉపర్​బెడా గ్రామంలో బాదసాహి, డుంగురిసాహి అనే రెండు గ్రామాలు ఉన్నాయి. 20 కుటుంబాలు ఉన్న బాదసాహిలో కరెంట్ ఉండగా.. డుంగురిసాహి వాసులు మాత్రం కిరోసిన్​ దీపాలతో బతికారు. ఫోన్లు చార్జింగ్​ చేసుకోవాలంటే.. డుంగురిసాహి వాసులు పక్కనే ఉన్న బాదసాహికి వెళ్తుంటారు.