48 గంటల్లో నో డ్యూస్ సర్టిఫికెట్ అందించాలి

48 గంటల్లో నో డ్యూస్ సర్టిఫికెట్ అందించాలి

న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో నో డ్యూస్ సర్టిఫికెట్ అందజేయాలని ఎన్నికల సంఘం శుక్రవారం రాష్ట్రాలను ఆదేశించింది. లేదంటే వారి నామినేషన్​ పత్రాలు రిజెక్ట్​ చేసే అవకాశం ఉందని తెలిపింది. ఇది అభ్యర్థులకే కాకుండా రాజకీయ పార్టీలకు, సంబంధిత నియోజకవర్గ ఓటర్లకు కూడా నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొంది. 

అలా జరగకుండా వెంటనే నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వాలని తెలిపింది. నిబంధనల ప్రకారం.. ఎవరైనా అభ్యర్థి.. ఎన్నికల నోటిఫికేషన్ తేదీకి ముందు గత  పదేండ్లలో ఎప్పుడైనా ప్రభుత్వం అందించిన వసతి గృహంలో ఉంటే.. దానికి సంబంధించిన కిరాయి, ఎలక్ట్రిసిటీ, వాటర్, టెలిఫోన్​ చార్జీల బకాయిలు పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది.