వరంగల్ లో సభ పెట్టే అర్హత బీజేపీకి లేదన్నారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. మేడారం జాతరకు జాతీయ హోదా తీసుకురాలేపోయారని ఫైర్ అయ్యారు. బీజేపీ తెలంగాణకు చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. బీజేపీ సీఎంలు, మంత్రులు, నేతలు సీఎం కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. ఉద్యోగుల గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదన్నారు చీఫ్ విప్ వినయ్ భాస్కర్. కేంద్రానికి అన్ని సంస్థలను అమ్ముకోవడమే తెలుసని ఆరోపించారు. బీజేపీ వ్యతిరేక శక్తులను కేసీఆర్ ఏకం చేస్తారని..దానికి తెలంగాణ కేంద్రంగా ఉంటుందన్నారు.
