సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 9న ప్రారంభమై ఏప్రిల్ 30 వరకు కొనసాగుతుంది.
మొత్తం ఖాళీలు: 26.
విభాగాల వారీగా ఖాళీలు: అనలైటిక్స్ & మోడల్ రిస్క్ (స్కేల్ IV/III) 06, అసెట్ లయబలిటీ మేనేజ్ మెంట్ (స్కేల్ III/II) 05, డిజిటల్ రిస్క్ మేనేజ్ మెంట్ (స్కేల్ III/II) 08, ఎంటర్‌ప్రైజ్ రిస్క్ (స్కేల్ III) 05, మార్కెట్ రిస్క్ (స్కేల్ III/II) 02.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్/ బీఎస్సీ, ఎంబీఏ/ సీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కనీసం 3 నుంచి ఐదేండ్ల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 20 నుంచి 45 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 9.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు రూ.175. ఇతరఅభ్యర్థులకు రూ.850.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 30.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ ఎగ్జామ్కు 70 శాతం, ఇంటర్వ్యూకు 30 శాతం వెయిటేజీ ఉంటుంది.
ఆన్‌లైన్ ఎగ్జామ్ తేదీ: మే (తాత్కాలికం)
ఇంటర్వ్యూ తేదీ: జూన్ (తాత్కాలికం)
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ centralbank.bank.inను సందర్శించండి.
