యూపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఓ కొత్త వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకవైపు రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వాలు ప్లాన్ చేసుకుంటుంటే.. మరోవైపు అధికార బీజేపీ ప్రభుత్వంలోని కీలక నేత చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఉద్యోగాల కోసం వెతుకులాట కంటే.. ఈ-రిక్షాలు నడుపుకుంటూ హాయిగా జీవించవచ్చంటూ యూపీ ఉప ముఖ్యమంత్రి అక్కడి యువతకు ఇచ్చిన సలహా ప్రస్తుతం రాజకీయ దుమారానికి కారణమైంది. నిరుద్యోగ సమస్య తీవ్రంగా వేధిస్తున్న తరుణంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటీవల కేవలం 6 నెలల్లోనే లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు వెళుతూ.. ఒకే విడతలో 3 వేలకు పైగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్న సరిగ్గా అదే సమయంలో.. డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్ వ్యాఖ్యలు బీజేపీ ప్రభుత్వ వాదనకు పూర్తిగా విరుద్ధంగా నిలిచాయి. లక్నోలో జరిగిన 'భారత్ ట్యాక్సీ' సర్వీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన యువతను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
By admitting that their own children study abroad and secure lucrative jobs at multinational corporations, the Deputy CM of Uttar Pradesh has exposed a deep double standard. While BJP leaders build empires for their families,even allegedly establishing private oil companies and forcing the nation to buy from them , they preach the "lucrative benefits" of driving rickshaws to ordinary citizens. They ensure power and wealth stay within their lineages, while expecting the children of common citizens to remain trapped in manual labor.
— Deepak kumar (@BarristerDeepak) September 28, 2026
ఉద్యోగాల వెంటపడి సమయం వృథా చేసుకోకండి.. రోజులో కేవలం 4 గంటలు ఈ-రిక్షా నడిపితే జీవనం సాగిపోతుంది. మిగిలిన సమయంలో మధ్యాహ్నం పూట మీ పిల్లలతో హాయిగా గడపవచ్చు అంటూ బ్రిజేష్ పాఠక్ యువతకు సలహా ఇవ్వటం కాంట్రవర్సీగా మారింది. చదువుకున్న యువత స్వయం ఉపాధి బాట పట్టాలనే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ.. అది నెటిజన్లను, విపక్షాలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు డిప్యూటీ సీఎంపై మండిపడుతున్నారు.
►ALSO READ | UPI ఛార్జీలు కట్టాల్సిందే.. స్టే ఇవ్వని సుప్రీంకోర్టు
దేశంలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ భారాన్ని తేలికగా తీసిపారేసేలా బీజేపీ లీడర్స్ వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం తీవ్రంగా శ్రమిస్తుంటే.. అధికారంలో ఉన్న పెద్దలు ఈ-రిక్షాలు నడుపుకోమని సలహా ఇవ్వడం దారుణమని మండిపడుతున్నారు. దేశాన్ని నడిపించాల్సిన యువతకు రిక్షాలు తొక్కమని చెప్పడం ఏంటని ఎద్దేవా చేస్తున్నారు. నేతలు మాత్రం తమ పిల్లలను విదేశాలకు పంపి చదివిస్తారని, సాధారణ యువతకు మాత్రం రిక్షాలు నడుపుకోమని సలహాలు ఇస్తారా అంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర నిరసన వెల్లువెత్తుతోంది.
ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు సైతం అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు పుష్పేంద్ర సరోజ్ ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎంపై ఘాటుగా స్పందించారు. నేటి యువతే దేశాన్ని నడిపిస్తుందని అన్నారు. మీకు రిక్షాలు తొక్కే హాబీ ఉంటే.. మీకో రిక్షాను బహుమతిగా పంపిస్తాను గౌరవనీయ డిప్యూటీ సీఎం గారూ.. అంటూ ఎద్దేవా చేశారు.
