తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

 తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఆదివారం (ఏప్రిల్ 12) ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు ప్రధాన కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కేకే ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్ tgbie.cgg.gov.in లో చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. 

8096958096 నెంబర్‎కు వాట్సాప్ మెసేజ్ పంపడం ద్వారా కూడా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 2026, ఫిబ్రవరి 25 నుంచి మార్చి18 వరకు ఇంటర్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఫస్టియర్ విద్యార్థులు 4,89,126 మంది, సెకండియర్ విద్యార్థులు 5,07,949 మంది పరీక్షలకు హాజరయ్యారు.  

ఇంటర్ ఫస్టియర్

పరీక్ష రాసిన విద్యార్థులు-4,89,123 
ఉత్తీర్ణత-3,23,807
గర్ల్స్-74.40%
బాయ్స్ 57.69%
ఫస్టియర్ ఓవరాల్ పాస్ పర్సంటేజ్-66.20%

ఇంటర్ సెకండియర్:

పరీక్ష రాసిన విద్యార్థులు-5,07,948
ఉత్తీర్ణత-3,58,490
 గర్ల్స్-78.65%
బాయ్స్-62.50%
సెకండియర్ ఓవరాల్ పాస్ పర్సంటేజ్-70.58%