MS Dhoni: CSK ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ఐపీఎల్ మొత్తానికి ఎంఎస్ ధోనీ దూరం?

MS Dhoni: CSK ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ఐపీఎల్ మొత్తానికి ఎంఎస్ ధోనీ దూరం?

MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ మొదలై రెండు వారాలు గడిచినా, ఆ జట్టు మాజీ కెప్టెన్ MS ధోనీ ఇంకా మైదానంలోకి అడుగు పెట్టలేదు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌పై చెన్నై సీజన్ తొలి విజయాన్ని నమోదు చేసినప్పటికీ, అతడు లేని లోటు స్పష్టంగా మైదానంలో కనిపించింది. అయితే ధోనీ ఫిట్‌నెస్ సాధిస్తే, కేకేఆర్‌పై ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అతను రాకపోతే, సంజూ శాంసన్ మరోసారి చెన్నై జట్టుకి కీలకం కానున్నాడు.

ఫిట్‌నెస్ సమస్యే కారణమా?: 
ఎంఎస్ ధోనీ ప్రస్తుతం కాళ్ళు పిక్కలు నొప్పులతో (Calf Injury) బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది జులై 7వ తేదీన 45వ పడిలోకి అడుగు పెట్టనున్న ధోనీ ఫిట్‌నెస్‌పై మాజీ ప్లేయర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ మాట్లాడుతూ.. ఎంఎస్ కేకేఆర్‌తో మ్యాచ్‌కు వస్తాడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.. అతను బ్యాటింగ్ ప్రాక్టీస్ అయితే మొదలుపెట్టాడు కానీ, ఎప్పుడు పునరాగమనం చేస్తాడనేది జట్టు మేనేజ్‌మెంట్‌కు కూడా సరిగ్గా తెలియదని పేర్కొన్నాడు.. జట్టు దృష్టి మళ్ళకూడదనే ధోనీ మైదానానికి రావడం లేదని తన యూట్యూబ్ ఛానెల్‌లో తెలిపాడు.
 
సంజూ శాంసన్ మెరుపులు: 
మహేంద్ర సింగ్ ధోనీ లేని లోటును భర్తీ చేసేందుకు CSK పక్కా ప్లాన్‌తో వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రేడ్ ద్వారా వచ్చిన సంజూ శాంసన్, లాంగ్ టర్మ్ వికెట్ కీపర్ ఆప్షన్‌గా కనిపిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ 115 పరుగులతో (నాటౌట్) వీరవిహారం చేసి చెన్నైకి ఈ సీజన్ మొదటి విజయాన్ని అందించాడు.

►ALSO READ | IPL 2026: లక్నో బ్యాటర్లను వణికించిన ప్రసిద్ కృష్ణ.. గుజరాత్ ముందు ఈజీ టార్గెట్!

పాయింట్ల పట్టికలో చెన్నై: 
రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని CSK ఈ సీజన్‌ను వరుసగా మూడు ఓటములతో అత్యంత పేలవంగా ప్రారంభించింది. కానీ నాలుగో మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల ఖాతా తెరిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై 9వ స్థానంలో కొనసాగుతుంది. ఇక చెన్నై తన తదుపరి పోరులో ఏప్రిల్ 14 (మంగళవారం) నాడు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనైనా ధోనీ మైదానంలో కనిపిస్తాడా అని 'ఎల్లో ఆర్మీ' ఆశగా ఎదురు చూస్తోంది. కానీ  ధోనీ ఫిట్‌నెస్ సాధిస్తే, కేకేఆర్‌పై ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ అతను రాకపోతే, ఐపీఎల్ 2026 టోర్నీ మొత్తానికి దూరమైనట్లేనని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.