IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా ఏకనా స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు మాత్రమే చేసింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్ల ధాటికి లక్నో బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఒక దశలో తక్కువ స్కోరుకే పరిమితమవుతుందనుకున్నప్పటకీ చివర్లో లక్నో బ్యాటర్లు కాస్త మెరుపు బౌండరీలతో ఆదుకున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (14), కగిసో రబాడ బౌలింగ్‌లో గిల్ చేతికి చిక్కి త్వరగానే పెవిలియన్ చేరుకున్నాడు. ఆ తర్వాత భారీ అంచనాలతో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రిషభ్ పంత్ (18) కూడా నిరాశపరిచాడు. సిరాజ్ వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయి రాహుల్ తెవాటియాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ప్రసిద్ కృష్ణ 'పంజా':
ఒకవైపు వికెట్లు పడుతున్నా ఐడెన్ మార్క్రమ్ (30) కాసేపు ప్రతిఘటించాడు. ప్రమాదకరంగా మారుతున్న మార్క్రమ్‌ను ప్రసిద్ కృష్ణ అవుట్ చేసి లక్నోను దెబ్బకొట్టాడు. అనంతరం వచ్చిన ఆయూష్ బదోని (9) కూడా ప్రసిద్ బౌలింగ్‌లోనే గ్లెన్ ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి నిరాశపరిచాడు. దీంతో లక్నో 74 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మధ్యలో నికోలస్ పూరన్ (19), అబ్దుల్ సమద్ (18) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ, ప్రసిద్ కృష్ణ మళ్ళీ తన బౌలింగ్ పదును చూపించి పూరన్‌ను అవుట్ చేశాడు. వెంటనే అబ్దుల్ సమద్‌ను అశోక్ శర్మ పెవిలియన్ కి పంపడంతో లక్నో భారీ స్కోరు చేయాలనే ఆశలు గల్లంతయ్యాయి. చివరి ఓవర్లలో జార్జ్ లిండే, మహ్మద్ షమీ విలువైన బౌండరీలు బాదడంతో లక్నో గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది.
►ALSO READ | MI vs RCB మధ్య హై-వోల్టేజ్ పోరు.. ఈ మ్యాచ్లో ఆ జట్టుదే పైచేయి!
చెలరేగిన గుజరాత్ బౌలర్లు:
లక్నో సూపర్ జెయింట్స్ పై గుజరాత్ టైటాన్స్ బౌలర్లు చెలరేగారు. ప్రసిద్ కృష్ణ తన కోటా ఓవర్లలో కీలకమైన 4 వికెట్లతో లక్నో నడ్డి విరడంతో పాటు కేవలం 28 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అలాగే అశోక్ శర్మ కూడా 2 వికెట్లు తీసి తన వంతు సహకారం అందించాడు. ఇక మహ్మద్ సిరాజ్, కగిసో రబాడ చెరో వికెట్ సాధించారు.
The lower order stepping up huge 👏
— IndianPremierLeague (@IPL) April 12, 2026
🎥 Crucial late fireworks provide the much-needed strong finish for #LSG 💪
Updates ▶️ https://t.co/kIuuJYbiNx#TATAIPL | #KhelBindaas | #LSGvGT pic.twitter.com/BP7s3mBLI2
